Saturday, October 5, 2024
Homeనేషనల్Rivaba Jadeja : ర‌వీంద్ర జడేజా భార్య రివాబా విజయం

Rivaba Jadeja : ర‌వీంద్ర జడేజా భార్య రివాబా విజయం

Rivaba Jadeja : గుజ‌రాత్ రాష్ట్రంలో మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అధికారం చేప‌ట్టడం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 150కి పై చిలుకు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీలైన కాంగ్రెస్ (20), ఆమ్ఆద్మీ (5)పార్టీలు క‌నీసం ద‌రిదాపుల్లో కూడా లేవు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. బీజేపీ అభ్య‌ర్థిగా నార్త్‌జామ్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేసినా క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజా ఘ‌న విజ‌యం సాధించింది. స‌మీప అభ్య‌ర్థిపై 61,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా రివాబా జ‌డేజా మాట్లాడుతూ “నాకు అభ్య‌ర్థిగా అవ‌కాశం ఇచ్చిన బీజేపీతో పాటు నా కోసం ప్ర‌చారంలో ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌లు, నాకు ఓటు వేసిన గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఇది నా విజ‌యం కాదు. మీ అంద‌రి విజ‌యం” అని రిబావా చెప్పారు. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన రివాబా భారీ మెజార్టీతో గెలుపొంద‌డం విశేషం.

ర‌వీంద్ర జ‌డేజా కూడా త‌న భార్య గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News