కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో నూతన రేషన్ షాప్ ను ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ ఆరెల్లి వనజ- వెంకటేష్ దంపతులు ఎమ్మెల్యే బాలకిషన్ ను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అనంతరం తిమ్మాపూర్-పోరండ్ల గ్రామాల మధ్యలో ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను రసమయి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రెడ్డి త్రివేణి- తిరుపతిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగల ఏకానందం, ఆశోద శ్రీనివాస్, తహ సిల్దార్ కే. కనకయ్య, రేషన్ డీలర్ ఆరెల్లి వనజ- వెంకటేష్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.