ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వచ్చే పౌర్ణమిని రైతులు ఏరువాక పౌర్ణమి అంటారు. బండిఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్వర్యంలో పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. అన్నదాతలు తమ నేస్తాలైన వృషభాలను చాలా చక్కగా అలంకరించి పొలాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ పనిలో భాగంగా తొలి దుక్కి దున్ని పండుగను జరుపుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత ఫథకం క్రింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20000 రూ. లు ఆర్థీక సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నందిపాటి నరశింహారెడ్డి, జాకీర్, లాయర్ కృష్ణారెడ్డి వెంకట్రామయ్య, నర్ల నాగేశ్వరరెడ్డి వివిధ గ్రామాల తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం బండి ఆత్మకూరు మండలం పార్లపల్లె గ్రామంలో బుల్లెట్ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలన భరించలేక తెలుగుదేశం పార్టీకి వలసలపర్వం మొదలైందని పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Budda Rajasekhar: ఏరువాక పౌర్ణమి వేడుకలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వచ్చే పౌర్ణమిని వేడుకగా జరుపుకున్న రైతులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES