Thursday, September 19, 2024
HomeతెలంగాణSandra: ఘనంగా 'సురక్ష దినోత్సవ' వేడుకలు

Sandra: ఘనంగా ‘సురక్ష దినోత్సవ’ వేడుకలు

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నేర నియంత్రణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో సురక్షా దినోత్సవాన్ని సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సురక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా పెట్రోలింగ్‌ కార్స్‌, బ్లూ క్లోట్స్‌, ఫైర్‌ వెహికిల్స్‌తో నిర్వహించిన ర్యాలీనీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జండా ఊపి ప్రారంభించగా సత్తుపల్లి పట్టణం నుండి గంగారం గ్రామం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు.

- Advertisement -

సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఫైర్ సిబ్బంది వినూత్న విన్యాస ప్రదర్శనలు సురక్ష దినోత్సవ వేడుకల్లో ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రక్షణ శాఖ పట్ల ఎంతో శ్రద్ధ చూపడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ నేరవిభాగా నియంత్రణలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. నేడు ప్రతి పొలిస్ స్టేషన్ కు కొత్త వాహనాలు అందించి అవాంఛనీయ సంఘటనలకు చెక్ పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. పెట్రో బైక్ లు,హైవే పెట్రో కార్ లు ద్వారా పోలీస్ శాఖ చాలా ప్రమాదాలు అరికడుతోందన్నారు. రాష్ట్ర రాజధాని వేదికగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నేర నియంత్రణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో హోం శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News