Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఒక్కటే భూమి, ఒక్కటై కాపాడుకుందాం

Nandyala: ఒక్కటే భూమి, ఒక్కటై కాపాడుకుందాం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మొక్కలు నాటిన కలెక్టర్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాల ఎస్బిఐ కాలనీ చెరువు కట్ట వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్, ఎస్పీ రఘువీరా రెడ్డి,డిఎఫ్ఓ వినీత్ మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ చిన్న చెరువు కట్ట గట్టుపై అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్, శిల్పా మహిళా సహాకర్ ఛైర్మెన్ నాగిని రవి సింగారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న 36వ వార్డు కౌన్సిలర్, స్థానిక ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి నాగినిరెడ్డి, డిఎఫ్ఓ వినీత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, డిఎస్పి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News