Sunday, October 6, 2024
HomeతెలంగాణJivan Reddy: వెలుగు జిలుగుల తెలంగాణకు కర్మ, కర్త, క్రియ KCR

Jivan Reddy: వెలుగు జిలుగుల తెలంగాణకు కర్మ, కర్త, క్రియ KCR

ఎటు చూసినా వరి కోతలే తప్ప విద్యుత్ కోతలు లేవు- జీవన్ రెడ్డి

ఇది “పవర్ ఫుల్” తెలంగాణ. ఈ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరణకు కర్మ, కర్త, క్రియ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్తురంగ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్ని సబ్‌ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్‌స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించారు. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

- Advertisement -


ఇందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ జరిగిన ‘విద్యుత్ దినోత్సవం’లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ శ్రమతో నాటి చీకట్లు మాయం, నేడు వెలుగు జిలుగుల మయం అని ఆనందం వ్యక్తం చేశారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలో తెలంగాణే నెంబర్‌వన్‌. ఈ విద్యుత్తేజానికి కారకులు కేసీఆరే. నాడు పవర్ నిల్. నేడు పవర్ ఫుల్. నాడు కరెంట్ ఉంటే వార్త..నేడు కరెంట్ పోతే వార్త. నాడు పవర్ హాలిడేలు. నేడు పవర్ ఫుల్ డేలు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఫస్ట్. కరెంట్ విజయం వల్లే కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఎటు చూసినా వరికోతలు తప్ప విద్యుత్ కోతలు లేవు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే రూ.320కోట్ల విద్యుత్ సబ్సీడీ వచ్చింది. మోటార్లకు మీటర్లు పెడుతున్న మోడీ సర్కారుకు మీటర్ బిగిద్దాం. రైతుల రక్తం పీల్చి పిప్పి చేస్తున్న మోడీ ప్రభుత్వం పోవాలి. గుజరాత్ మోడల్ వద్దు.. తెలంగాణ మోడలే ముద్దు.అన్ని రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నాయి.

తెలంగాణ విద్యుత్ విజయం దేశానికే ఆదర్శం. 24 గంటల విద్యుత్ సరఫరా ఒక చరిత్ర. ఇందుకువిద్యుత్ రంగ సంస్కర్త కేసీఆర్ గారికి పాదాభివందనం” అని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బెదిరించారన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్‌ ఎక్కడి నుండి వస్తుందని సీమాంధ్ర నేతలు ఎద్దేవా చేశారన్నారు. తెలంగాణ ఇస్తే విద్యుత్‌ వ్యవస్థలు కుప్పకూలతాయని చిలుక జోస్యాలు చెప్పారన్నారు. కానీ ఇవేవి నిజం కాదని తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని జీవన్ రెడ్డి చెప్పారు.



కార్యక్రమంలో జడ్పిటిసి మెట్టు సంతోష్, ఎంపిపిలు మాస్త ప్రభాకర్, పస్క నర్సయ్య, జడ్పి సీఈవో గోవింద్, సర్పంచులు, ఎంపిటీసిలు, విద్యుత్ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News