విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం వైయస్. జగన్ సమావేశం. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం వైయస్. జగన్ సమావేశం. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.
- Advertisement -
నాలుగేళ్లలో వృద్ధి బాగుంది :
- ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని వివరించిన అధికారులు.
- స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని వివరించిన అధికారులు.
- గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని వెల్లడించిన అధికారులు.
- 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్ రేట్ 11.43శాతానికి పెరిగిందని వెల్లడించిన అధికారులు.
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని వెల్లడించిన అధికారులు.
- 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉందని వెల్లడించిన అధికారులు.
- జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని వెల్లడించిన అధికారులు.
- 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.
- 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపిన అధికారులు.
- 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని తెలిపిన అధికారులు.
రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి
- పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర : సీఎం
- ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి:
- ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి: సీఎం
- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి.
- MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలన్న సీఎం.
- దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించిన సీఎం.
- పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
- ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలని ఆదేశించిన సీఎం.
- రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్న సీఎం.
- మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.
- ప్రస్తుతం ఉన్నడిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్న సీఎం.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు… కార్యరూపంలోకి ప్రతిపాదనలు :
- పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ వెల్లడించిన అధికారులు.
- ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి… 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్న అధికారులు.
- వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడి.
- 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు.
కాని ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని వెల్లడి. - విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడి.
- ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించిన అధికారులు.
- రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయని వెల్లడించిన అధికారులు
- జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపిన అధికారులు.
- గ్లోబల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశాలు.
విద్యుత్ ప్రాజెక్టులపైనా సమీక్ష:
- విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించిన అధికారులు.
- ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపిన అధికారులు.
- మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని తెలిపిన అధికారులు.
- విశాఖ సదస్సు ద్వారా కాకుండా… అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, 11 డీపీఆర్ పూర్తిచేసుకున్నాయని వెల్లడించిన అధికారులు.
- మొత్తం వీటిద్వారా 8.85లక్షల కోట్లు పెట్టిబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించిన అధికారులు.
ఐటీకి చిరునామా విశాఖ కావాలి :
- ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్ కావాలని సీఎం అన్నారు.
- దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
- దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని సీఎం అన్నారు.
- ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించిన సీఎం.
ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి:
- ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపైనా సీఎంకు వివరాలు అందించిన అధికారులు.
- ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్ రంగంలో 88 ఒప్పందాలు చేసుకోగా, వీటి విలువ రూ.44,963 కోట్లని తెలిపిన అధికారులు.
- ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని వెల్లడించిన అధికారులు.
- దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని వెల్లడి.
- ఇవికాక ఫుడ్ ప్రాససింగ్, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్ష చేశారు.
- ఫుడ్ ప్రాససింగ్ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
- టమెటా, ఉల్లి లాంటి … డిమాండులో తీవ్ర వ్యత్యాసం తరచుగా వచ్చే పంటల విషయంలో ఈ ప్రాససింగ్ యూనిట్లనే నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు.
- దీనివల్ల రైతులకు తోడ్పాటు ఇచ్చినట్టువుతుందన్నారు.