Friday, September 20, 2024
HomeతెలంగాణMulugu: దేశంలో పవర్ కట్లు లేని రాష్ట్రం మనదే

Mulugu: దేశంలో పవర్ కట్లు లేని రాష్ట్రం మనదే

తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు సచ్చినా పెట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పారు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు ములుగు జిల్లాలో విద్యుత్ రంగ విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.

- Advertisement -

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్……

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్‌ ఇవ్వకపోయేవారు. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవాళ్లు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకే గౌరవ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా అందించారు. దీంతో పరిశ్రమల నిర్వాహకులు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ కోసం పడిన కష్టాలన్నింటినీ మర్చిపోయారు. కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్‌ రంగాలపైనే ప్రధాన దృష్టి సారించారు. పరిశ్రమలకు అనతి కాలంలోనే నాణ్యమైన కరెంటును సరఫరా చేయడంతో మూతపడ్డ అనేక పరిశ్రమలు తెరుచుకున్నాయి. అంతే కాకుండా, కొత్త పరిశ్రమలు కూడా వెలుస్తున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికులు ముందుకు వస్తున్నారు. విద్యుత్ సంస్కరణ పేరుతో రైతుల పైన మోడీ ప్రభుత్వం భారం మోపే ప్రయత్నం చేస్తూ, మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోటార్లు మీటర్లు సచ్చిన పెట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పారు. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త , ఈరోజు కరెంటు పోతే వార్త అన్న మాదిరిగా పరిస్థితి మారింది. ప్రతి సంవత్సరం రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చేందుకు10,500 కోట్ల రూపాయల భారీ ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News