Friday, September 20, 2024
HomeతెలంగాణKodimyala: అంగన్వాడి కేంద్రాల్లో శ్రీమంత కార్యక్రమ వేడుకలు

Kodimyala: అంగన్వాడి కేంద్రాల్లో శ్రీమంత కార్యక్రమ వేడుకలు

ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీమంతాలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ సెక్టార్ పరిధిలోని చెప్యాల, రామకృష్ణాపురం, పూడూర్ గ్రామాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీమంతాల కార్యక్రమాలను ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భవతులకు 1000 రోజుల ప్రాముఖ్యతను గురించి, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్య పరిశుభ్రతలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్.సుధారాణి, పూడూర్ గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ బండ లింగారెడ్డి, సెక్రెటరీ మనోహర్ రెడ్డి, సిహెచ్ఓ. వందన ఏఎన్ఎం సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు సురేఖ, వసంత, పద్మ, స్నేహలత, పుష్పలతలు, చెప్యాల గ్రామంలో ఎంపిటిసి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గుంటి ఎల్లయ్య, సెక్రెటరీ, అంగన్వాడీ టీచర్లు ఎం.ఉమ, టి.అంజలి, బి.సుజాత, డి.జ్యోతి, రామకృష్ణాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ నవీన్, సిఎ. అర్చన, అంగన్వాడీ టీచర్లు ఎలగుర్తి వినోద, దువ్వంతుల విజయ, పీల్డ్ అసిస్టెంట్ బాలయ్య, ఆశా కార్యకర్తలు, ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News