Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Adimulapu Suresh: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదనటం అవాస్తవం

Adimulapu Suresh: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదనటం అవాస్తవం

అవాస్తవాలతో కథనాన్ని ప్రచురించడాన్ని ఖండించిన మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో బిల్లులు అన్నీ పేరుకు పోయాయని, గుత్తేదారులకు చెల్లింపులు జరపకపోవడం వల్ల పనులన్నీ అగిపోయాయని, పనుల నిర్వహణకు ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదంటూ పలు అవాస్తవాలతో కథనాన్ని ప్రచురించడాన్ని మంత్రి ఖండించారు. ఈ వార్తాంశంలో ఏమాత్రం నిజంలేదని, ప్రభుత్వంపై విషంజిమ్మేలా అవాస్తవాలతో ఈ కథకాన్ని ప్రచురించడం జరిగిందంటూ వాస్తవాలను ఆయన వివరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ పనులకు సంబందించి గత వారం పదిరోజుల్లో సి.ఎప్.ఎం.ఎస్.లో పెండింగ్ లో నున్న 2,760 బిల్లులకు సంబందించి రూ.510.46 కోట్లు చెల్లింపు చేశామన్నారు. ఇందులో కరెంటు చార్జీల 16 బిల్లులకు రూ.20.54 కోట్లు, 1,926 వర్కు బిల్స్ కు రూ.258.20 కోట్లు, సచివాలయాల అద్దెలకు సంబందించి 2 బిల్లులకు రూ.9.19 కోట్లు, 44 మిస్లేనియస్ బిల్లులకు సంబందించి రూ.51.98 మరియు ఇతర ఖర్చులకు సంబందించిన బిల్లులు కలుపుకుని మొత్తం 1,992 బిల్లులకు సంబందించి రూ.340.67 కోట్లు మేర మున్సిఫల్ జనరల్ ఫండ్స్ ను చెల్లించామన్నారు.

- Advertisement -

పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో జవసత్వాలు అందిస్తున్నాము…..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టినప్పటి నుండి పట్టణ స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే విధంగా, పూర్తి స్థాయిలో స్వేచ్చను ఇస్తూ నూతన జవసత్వాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ పరంగా వేలాది కోట్లతో పలు పథకాలను పెద్ద ఎత్తున చేపట్టి అమలు చేయడం జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ పట్ట్టణ స్థానిక సంస్థల్లో స్థానికంగా పనులు నిర్వహణకు సహజంగానే ఎన్నో ఆటంకాలు ఉంటాయని, వాటన్నింటినీ అదిగమిస్తూ పనులను ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 7 స్థానిక సంస్థల్లోనే సమస్యలు ఉన్నాయని, మిగిలిన అన్ని పట్టణ స్థానకి సంస్థల్లో పనులు సజావుగానే సాగుతున్నాయన్నారు. పనులకు సంబందించిన అన్ని పెండింగ్ బిల్లులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశామన్నారు. చెల్లింపులు విషయంలో కాంట్రాక్టర్లు ఎవరూ ఇబ్బంది పడటం లేదని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News