Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు సూచనలు

Kurnool: ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు సూచనలు

ఇన్సూరెన్స్ ఉన్న ఆటోలు మాత్రమే నడపాలన్న కర్నూలు ట్రాఫిక్ పోలీస్ విభాగం

డిఎస్పి ఎం నాగభూషణం ఆధ్వర్యంలో కర్నూల్ కిడ్స్ వరల్డ్ దగ్గర ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్స్ లైసెన్స్ కలిగి ఉండవలెనని ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఇన్సూరెన్స్ ఉన్న ఆటోలు మాత్రమే నడపాలని, ఎలాంటి యాక్సిడెంట్స్ కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా ఆటోలు నడపవలెనని ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ధరించవలెనని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నియమాలు పాటించాలని సెల్ఫోన్ డ్రైవింగ్ రాంగ్ రూట్ లో ఆటోలను నడపరాదని, అతి వేగంగా ఆటోలను నడపకుడదని ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పి తెలపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ DSP, M నాగభూషణం, RSI ఉసేన్ అహ్మద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News