Sunday, September 22, 2024
HomeతెలంగాణUAE: యూఏఈలో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

UAE: యూఏఈలో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గన్ని ప్రకటించిన ETCA ఫౌండర్ పీచర కిరణ్ కుమార్

ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక-సంక్షేమ సంఘం ETCA, భారత జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అజ్మన్ లోని హాభిటాట్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ప్రవాసీయులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ గీతం ఆలపించి వేడుకలను ప్రారంభించారు, తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, అమరులారా వందనం వీరులారా వందనం అంటూ ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం గొప్పతన్నాని, చరిత్రను, ఉద్యమంలో వారి పాత్రను కొనియాడుతూ 2 నిముషాలు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ కృషిని వారు ఉద్యమానికి అందించిన బలాన్ని , తోడ్పాటును గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

కొమరం బీమ్ , చాకలి ఐలమ్మ , నారాయణ రెడ్డి , శ్రీకాంత చారి, యాదయ్య , కిష్టయ్య లాంటి అమరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనకై వివిధ దేశాలలో కృషి చేసిన ప్రవాసీ సంఘాలకు, ఎన్నారైలకు శుభాకాంక్షలు తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అప్పట్లో గల్ఫ్ దేశాల్లో ఎన్నో కఠిన చట్టాలు ఉన్న యూఏఈ గడ్డ నుండి 2010 నుండి 2014 వరకు మాతృభూమి లో జరిగిన ఉద్యమానికి సంఘీభావంగా ETCA ఆధ్వర్యంలో నిర్వహించిన యూఏఈ తెలంగాణ ఎన్నారై మీట్ , ధూమ్ ధామ్ , మానవ హారాలు , వంట వార్పు , తెలంగాణ అట పాట, తెలంగాణ విమోచన దినోత్సవాలు, నిరవధిక దీక్ష , సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ , రైల్ రోకో వంటి కార్యక్రమలలో ETCA సభ్యులు ఇక్కడి నుండి వెళ్లి ప్రత్యక్ష్యంగా పాల్గొన్న ఉద్యమ రోజులని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ చారిత్రక వైభవాన్ని, ఉద్యమ శైలిని తలపించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల డప్పు చప్పుళ్ళు, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకి అంటూ నినాదాలు కార్యక్రమ వేదికను హోరెత్తించాయి.

ప్రత్యేకంగా తయారు చేసిన అమరవీరుల స్థూపం అందరిలో ఒక మానసిక ఉద్వేగాన్ని , బాధను నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన రాదారపు సత్యం 5 సంవత్సరాలు ETCA అధ్యక్ష్యుడిగా సేవలు అందించిన రాదారపు సత్యం, ఉపాధ్యక్ష్యులు అరవింద్ రాగం, ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ మాన్యంలకు సభ్యులు అభినందనలు తెలియచేసి సన్మానించారు.


సాంస్కృతిక కార్యక్రమలను ప్రదర్శించిన చిన్నారులకు , మహిళలకు , కళాకారులకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమాలకు వచ్చినవారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఏర్పటైనా ETCA నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్ష్యులు మామిడి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్ష్యులు జగదీశ్ రావు చీటీ, ప్రధాన కార్యదర్శి వినోద్ ఆచార్యులు, నిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ ఎలిగేటి, కార్యవర్గ సభ్యులు శేఖర్ గౌడ్ గుండవేని, ఎస్ పి కస్తూరి, సురేశ్ రెడ్డి అంబటి, జలంధర్ రెడ్డి వెలమ, వేణుగొల్లపెల్లి , చైతన్య చకినం, తిరుమల రావు, తిరుపతి రెడ్డి, సంతోష్ కుమార్ స్థంభంకాడి, రఘు ఎలిగేటి, రాణి కోట్లను ప్రకటించారు. సలహాదారులు కిరణ్ కుమార్ పీచర , సత్యం రాధారపు , అరవింద్ బాబు రాగం , సాయి చందర్ కటకం , పీచర వెంకటేశ్వర్ రావు, మహిళా విభాగం సరోజ అల్లూరి, దీపిక ఎలిగేటి , సారిక పీచర , మమత కస్తూరి , విపుల దుర్శేటి, లక్ష్మి ఆనంద్, ఈ కార్యక్రమంలో ETCA సభ్యులు కిరణ్ కుమార్ పీచర , రాధారపు సత్యం , మామిడి శ్రీనివాస్ రెడ్డి , జగదీష్ రావు , వినోద్ ఆచార్యులు , శ్రీనివాస్ ఎలిగేటి మరియు భారత జాగృతి యూఏఈ అధ్యక్ష్యులు పీచర వెంకటేశ్వర్ రావు , ఉపాధ్యక్ష్యులు అరె శేఖర్ గౌడ్ GWPC అధ్యక్ష్యులు గుండెల్లి నర్సింహా పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News