Sunday, October 6, 2024
HomeతెలంగాణMiryalaguda: పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

Miryalaguda: పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

24 గంటల విద్యుత్, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన, సమర్ధవంతమైన పరిపాలన వల్లే జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో జరిగిన ” తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ” కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, టిఎస్ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్ .డి .ఓ బి. చెన్నయ్య, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మిర్యాలగూడ నియోజకవర్గం పారిశ్రామిక వేత్తలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీపీలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టి ఎస్ ఐ పాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారిందన్నారు. 24 గంటల విద్యుత్, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన, సమర్ధవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని వెల్లడించారు. ఐటి రంగంలో దేశంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2013-14 లో హైదరాబాద్ ఐటి ఉత్పత్తిలు 56 వేల కోట్లు మాత్రమే కానీ నేటికీ వార్షిక వృద్ధితో 2,41,275 కోట్ల రూపాయల ఎగుమతులకు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 9,05,715 లక్షల ఐటి ఉద్యోగులు ఉపాధిని పొందారని అన్నారు. జిల్లాలో టి ఎస్ ఐపాస్ ద్వారా 720 యూనిట్లు అనుమతులు పొంది ఉన్నాయని, వీటిలో 55 పరిశ్రమలు ఇప్పటికే ప్రోడక్ట్స్ ప్రారంభించాయని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధి కల్పించాలి ఐటిని జిల్లాల్లో విస్తరించాలని సంకల్పంతో 74 కోట్ల రూపాయల SIF తో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటి టవర్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన పథకం టి -ఐ డియా” పథకమని, ఈ పథకం ద్వారా జిల్లాలో మెగా ప్రాజెక్టులకు, వాటి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News