Saturday, October 5, 2024
Homeనేషనల్Gujarat Election 2022 Result: గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రికార్డుల మోత మోగించిన బీజేపీ.. అవేమిటేంటే?

Gujarat Election 2022 Result: గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రికార్డుల మోత మోగించిన బీజేపీ.. అవేమిటేంటే?

Gujarat Election 2022 Result: గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు గురువారం వెలువ‌డ్డాయి. బీజేపీ గ‌తంలో ఎప్పుడూలేని స్థాయిలో అత్య‌ధిక స్థానాల్లో విజ‌య‌దుంద‌బి మోగించింది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాల‌కుగాను 156 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో ప‌లు రికార్డుల‌ను బీజేపీ బ‌ద్ద‌లు కొట్టింది. గ‌తంలో 150కుపైగా అసెంబ్లీ స్థానాల‌ను ఏ పార్టీ సాధించిన దాఖ‌లాలు లేవు. అలాంటిది, బీజేపీ దాదాపు 156 స్థానాల్లో పాగా వేసింది. అదేవిధంగా రికార్డు స్థాయిలో సీట్లతో గెలుపొందడంతో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కాకుండా వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక పార్టీ గా బీజేపీ నిలిచింది. 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్లపాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన సీపీఐ(ఎం) వరుసగా ఏడు ఎన్నికల్లోనూ విజయం సాధించింది.

- Advertisement -

గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెజారిటీ మార్కు 92. తాజా ఎన్నిక‌ల్లో సుమారు 156 అసెంబ్లీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురుతుంది. 2002లో 127 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పటి వరకు అత్యధిక స్థానాలు సాధించింది లేదు. గోధ్రా అనంతర అల్లర్ల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో మాధవ్‌సింగ్ సోలంకి నాయకత్వంలో కాంగ్రెస్ 149 స్థానాలు సాధించి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా 130 సీట్ల మార్కును దాటలేకపోయింది.

అంతేకాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి, ప్రధాన ప్రతిపక్షానికి మధ్య ఓట్ల శాతంలో రికార్డు స్థాయిలో వ్యత్యాసం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా రికార్డు స్థాయిలో 25 శాతం. పోలైన ఓట్లలో బీజేపీకి 52 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 27శాతం ఓట్లు వచ్చాయి. 2007లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా 11 శాతం. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నాయకత్వంపై గుజరాత్‌ ప్రజలు మరోసారి విశ్వాసం నింపారని, ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉంటామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నుంచి ఆయ‌న ల‌క్ష ఓట్ల‌కుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News