Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభMounika Reddy : పెళ్లి చేసుకోబోతున్న యూట్యూబ్ స్టార్.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్..

Mounika Reddy : పెళ్లి చేసుకోబోతున్న యూట్యూబ్ స్టార్.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్..

- Advertisement -

Mounika Reddy : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి ‘అబ్బాయి క్యూట్ అమ్మాయి నాటు’ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకుంది మౌనిక రెడ్డి. కరోనా ముందు సూర్య వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ తో కలిసి నటించి బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలలో నటిస్తుంది.

తాజాగా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతుంది. తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోనుంది. ఆ అబ్బాయిని సందీప్ అంటూ పరిచయం చేస్తూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. తాజాగా నిశ్చితార్థం జరగడంతో ఆ నిశ్చితార్థం ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఇక తన పెళ్లి గురించి చెప్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.

సందీప్ తో తన పెళ్లి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ లా జరగనుంది. డిసెంబర్ 17,18లో మా వివాహం జరగనుందని పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటిజన్లు, అభిమానులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News