రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారనిని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఏసిసి ప్రాంతంలో గల సూర్య కిరణ్ ఇండస్ట్రీస్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్నత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ… పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.