రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని సనోఫి హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆవరణలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షాలు పాల్గొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టిఎస్ ఐపాస్ ద్వారా సులభతరంగా అన్ని రకాల అనుమతిలివ్వడంతో పాటు 24 గంటల విద్యుత్, నీళ్లు, రాయితీలు అందిస్తుండటం ద్వారా నేడు విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయన్నారు. సునీతారెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలు అదుపులో ఉండటం, 24 గంటల విద్యుత్, పరిశ్రమలకు 10 శాతం నీళ్లు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా నేడు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఉపాధి కల్పనలో ఐటి రంగంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో రంగానికి ఒక్సో సెజ్ ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలు విస్తరిస్తున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని ఆ దిశగా పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పరిశ్రమల నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు రాయితీలను కూడా ఇస్తుందని తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పాలంటే భూమి, రోడ్డు, విద్యుత్, నీళ్లు, పెట్టుబడి, వృత్తి నైపుణ్యత గల కార్మికులతో పాటు నిరంతరాయంగా పరిశ్రమను నడుపుతాననే దృఢ సంకల్పం ఉంటే పరిశ్రమ నిలదొక్కుతుందని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేష్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్, ఆర్డీఓ శ్యామ్‌ప్రకాశ్, ఎడి మైన్స్ జయరాజ్, డిఆర్‌డిఓ శ్రీనివాస్, మనోహరాబాద్ సర్పంచ్ లు మహిపాల్‌రెడ్డి, ప్రభావతి పెంటయ్య, ఉమ్మడి మండల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపిపి పురం నవనీత రవి, తదితరులు పాల్గొన్నారు.
Chilamala Madan Reddy: ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
రాష్ట్రంలో ఒక్కో రంగానికి ఒక్సో సెజ్ ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమలు విస్తరిస్తున్నాయి