Saturday, October 5, 2024
Homeహెల్త్Home made face packs: ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే..

Home made face packs: ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే..

సహజసిద్ధమైన ఈ ఫేస్ మాస్కులు చర్మానికి గ్లో తెస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, ఎటువంటి ఖర్చు లేకుండా వంటింట్లోనే సహజసిద్ధమైన ఈ ఫేస్ మాస్కులు రెడీ చేసుకోండి

వేసవి ఫేస్ ప్యాకులు

- Advertisement -

వేసవిలో వీచే వేడిగాలుల వల్ల చర్మం, ముఖం బాగా దెబ్బతింటాయి. కాంతివిహీనంగా తయారవుతాయి. ముఖ్యంగా వేసవిలో చర్మం బాగా హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకు కొన్ని వేసవి ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఇంట్లోనే ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ వేసవి ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవడమే కాదు యాక్నే బారిన పడం. ఈ కూల్ ఫేస్ ప్యాక్స్ వల్ల చర్మం తాజాదనంతో ఉంటుంది. చర్మానికి కావలసింత హైడ్రేషన్, మాయిశ్చరైజర్లు అందుతాయి. అంతేకాకుండా సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా కూడా ఈ సమ్మర్ ఫేస్ ప్యాకులు సహాయపడతాయి. వీటిని వారానికి రెండు మూడుసార్లు వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. అలాంటి సమ్మర్ ఫేస్ ప్యాకుల్లో ముఖాన్ని కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్ ఒకటి ఉంది.
కీరకాయ, పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్టు అందుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా రెండు టేబుల్ స్పూన్ల కీర, రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం తీసుకోవాలి. తర్వాత ఒక టీస్పూను పాలపొడి, ఒక టీస్పూను పెరుగు కలిపి అందులో ఈ రెండు రసాలను బాగా కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దాన్ని ముఖం, మెడ భాగంలో రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం, మెడలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడుసార్లు రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రంచేస్తుంది.

ముఖాన్ని డల్ గా కనిపించేలా చేసే నల్లని మచ్చలను నివారిస్తుంది. అంతేకాదు పుచ్చకాయ, కీరకాయలు చర్మానికి ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. వేసవిలో చర్మాన్ని మెరిపించేలా చేసే పర్ఫెక్టు సమ్మర్ ఫేస్ ప్యాక్ ఇది. శాండల్ వుడ్ ఫేస్ ప్యాక్ వేసవిలో వండర్స్ స్రుష్టించే మరో ఫేస్ ప్యాక్. శాండల్ వుడ్ పొడి, రోజ్ వాటర్ రెండింటినీ కలిపి చేసే ఈ ప్యాక్ చర్మాన్ని మెరిపించేలా చేయడంతో పాటు ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది. జిడ్డు చర్మం వారికి సరిపడే సమ్మర్ ఫేస్ ప్యాక్ శాండల్ వుడ్ ఫ్యాక్. ఇందులో ఉపయోగించే శాండల్ వుడ్ పొడి మార్కెట్ లో దొరుకుతుంది. శాండల్ వుడ్ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ పోసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి, మెడభాగంలో, శరీరంలోని అన్ని భాగాలకు సైతం అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పూసుకుని కొంతసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ఉండే మచ్చలను పోగొడతుంది. ట్యాన్ పోగొట్టడంలో కూడా ఈ ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది.

మ్యాంగో ఫేస్ మాస్కు కూడా చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పొడి చర్మం ఉన్నవారిపై ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు తగినంత మాయిశ్చైజర్ అందివ్వడం ద్వారా చర్మం తాజాదనంతో మెరిసేలా తోడ్పడతుంది. ఇందుకోసం మామిడిపండు గుజ్జు, తేనె, పసుపు, పెరుగు, శాండల్వుడ్ పౌడర్ లని రెడీ పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల తాజా మామిడిపండు గుజ్జు, ఒక చెంచా శాండల్ వుడ్ ఫొడి, ఒక స్పూను తేనెలను తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని ముఖంపై, మెడ భాగంలో సమానంగా అప్లై చేయాలి. దాన్ని పదిహేను నిమిషాల వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం, మెడలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మాస్కు ముఖంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది సమ్మర్ లో బాగా పనిచేసే ఫేస్ ప్యాక్. సూర్య రశ్మి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా ఈ ప్యాక్ కాపాడుతుంది. అంతేకాదు వేసవిలో జిడ్డుచర్మం ఉన్న వారిపై బాగా పనిచేసే ఫేస్ ప్యాక్ కూడా ఇది. మిల్క్ ఫేస్ ప్యాక్ మరొకటి.

ఇది కూడా సమ్మర్ లో చర్మంపై ఎంతో శక్తివంతంగా పనిచేసే సహజసిద్ధమైన ఫేస్ మాస్కు. చర్మం పొడిబారినట్టు, కాంతివిహీనంగా, తాజాదనం కోల్పోయి ట్యాన్ తో కనిపిస్తుంటే ఈ ప్యాక్ ను అస్లై చేయాలి. ఇది చర్మంపై మంచి ఫలితం చూపుతుంది. ముఖ్యంగా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఈ ప్యాక్ ఇంట్లో చేసుకోవాలంటే పాలపొడి, తేనె కావాలి. రెండు టేబుల్ స్పూన్ల నాణ్యమైన ఆర్గానిక్ తేనెను తీసుకుని అందులో పాలపొడి వేసి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని ముఖంపై పూసుకొని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. రోజు మార్చి రోజు ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకోవచ్చు. దీనివల్ల చర్మంలోని డల్ గా కనిపించే స్వభావం తగ్గుతుంది. చర్మానికి తగినంత హైడ్రరేషన్ కూడా అందుతుంది. ఈ ఫేస్ ప్యాక్ రాసుకోవడం వల్ల చర్మం మ్రుదువుగా అవుతుంది. అంతేకాదు చర్మానికి కావలసింత మాయిశ్చరైజర్ ను ఈ వేసవి ఫేస్ ప్యాక్ అందిస్తుంది.

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచే మరొకటి పుదీనా ఫేస్ ప్యాక్. మీది సున్నితమైన చర్మం అయితే ఈ రకమైన చర్మం ఉన్నవారికి వేసవిలో ఈ మాస్కు ఎంతో బాగా పనిచేస్తుంది. పుదీనా చర్మానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది. చర్మానికి తాజాదనంతోపాటు మంచి మెరుపును సైతం అందిస్తుంది. ట్యాన్ తగ్గించి చర్మాన్ని వేగంగా కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్ ఇది. పుదీనా ఆకులను మెత్తగా పేస్టులా చేసి అందులో చిటికెడు పసుపు వేయాలి. ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పేస్టును ముఖంపై అప్లై చేసుకోవాలి. ముఖంపై దీన్ని పదిహేను నిమిషాలు పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. తీవ్రమైన ఎండ వేడితో మండుతున్న చర్మానికి ఈ ప్యాక్ ఎంతో సాంత్వననిస్తుంది. వేసవిలో ఈ ప్యాక్ ను మూడు లేదా నాలుగురోజులకొకసారి ముఖానికి అప్లై చేసుకుంటే ఎంతో మంచిది. ఇది కాంతివిహీనంగా ఉండే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

వేసవిలో మీరు మెచ్చే మరో కూల్ ఫేస్ మాస్కు ముల్తానీమట్టి ప్యాక్. నార్మల్ స్కిన్ ఉన్నవారికి వేసవిలో ఇది మంచి ప్రత్యామ్నాయం. దీన్ని ముఖానికి పూసుకుంటే చర్మం మెరియడంతో పాటు ముఖం ఎంతో తేజోవంతంగా ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ కోసం ముల్తానీమిట్టి, రోజ్ వాటర్ మిశ్రమం తీసుకుని పేస్టులా చేసి ముఖానికి పూసుకుంటే వెంటనే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖం కాంతివంతంగా తయారవడమే కాకుండా ఎంతో తాజాగా కూడా ఉంటుంది. ముల్తానీ మట్టి తీసుకుని అందులో తగినంత రోజ్ వాటర్ వేసి గా కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి పూసుకుని 20 నుంచి 25 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఉపయోగించిన ముల్తానీ మట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మరొక సమ్మర్ ఫేస్ ప్యాక్ శెనగపిండి ఫేస్ ప్యాక్. దీనికి శెనగపిండి, రోజ్ వాటర్, పెరుగు, పసుపులు కావాలి. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి మెత్తని పేస్టులా చేయాలి. ముఖం, మెడ భాగాలలో ఈ పేస్టును బాగా పట్టించాలి. తర్వాత దాన్ని అరగంట వరకూ అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్కును నిత్యం గాని లేదా రోజు మార్చి రోజుగానీ ముఖానికి రాసుకుంటే చర్మం వెంటనే మెరుపును సంతరించుకుంటుంది. ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ వేసవిలో చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. సహజసిద్ధమైన ఈ ఫేస్ మాస్కులను వాడడం వల్ల చర్మం బాగా ప్రకాశిస్తుంది. దుష్పరిణామాలు తలెత్తవు. అందుకే వేసవిలో మీ వంటింట్లోనే సహజసిద్ధమైన ఈ ఫేస్ మాస్కులను తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసుకుని అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News