Saturday, November 23, 2024
HomeతెలంగాణGangula: సర్కారుపై రేషన్ డీలర్లు నమ్మకముంచటం శుభపరిణామం

Gangula: సర్కారుపై రేషన్ డీలర్లు నమ్మకముంచటం శుభపరిణామం

గౌరవ భృతి, కమిషన్ పెంపు డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ గంగుల హామీ

నిన్న జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మే ఆలోచన విరమించి పేదలకు రేషన్ పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. సివిల్ సప్లైస్ భవన్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘాల ప్రతినిధులతో వారి విజ్ణప్తి మేరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంబందించి తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించారు. పేదల ఆకలిని తీర్చడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని వారికి వివరించారు.

- Advertisement -

ప్రజల్లో బాగమైన రేషన్ డీలర్లు కరోనా వంటి సంక్షోభ సమయంలో సేవలందించారని కొనియాడిన మంత్రి వారి సమస్యలన్ని పరిష్కారం దిశలో ఉన్నాయని భరోసానిచ్చారు. ముఖ్య డిమాండ్లైన గౌరవ భృతి, కమిషన్ పెంపు విషయాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. మంత్రి స్పష్టమైన హామీతో అన్ని జిల్లాల రేషన్ డీలర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి. అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, ఇతర ఉన్నతాదికారులు, అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News