అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, భూమి పూజ ఈరోజు శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు చేస్తున్నామని, కొన్ని గ్రామాలలో గ్రామపంచాయతీ భవనాలు పూర్తిచేసి ప్రారంభించుకున్నామని, రానున్న రోజులలో అన్ని గ్రామాలలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుందని గ్రామంలో అన్ని మౌలిక వసతులు సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు, సామాజిక భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, చెరువులు కట్టల మరమ్మత్తులు, కుంటల మరమ్మత్తులు ఇలా చెప్పుకుంటూ పోతే స్వరాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాయని అన్ని గ్రామాలు గణనీయమైన అభివృద్ధి సాధించాయని హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్రస్థాయిలో కొన్ని గ్రామపంచాయతీలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాయని, అధికారుల సహకారం, ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పిటిసి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.