తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన సాగు నీటి దినోత్సవంలో పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఉత్సవాలలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి తద్వారా 75 లక్షల ఎకరాలతో పాటు మరో 50 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసుకునే ఈదశాబ్ది ఉత్సవాలు అన్నారు. ఒడిసి పట్టిన వర్షం నీటితో తెలంగాణ రాష్ట్రంలో వరి సిరులు పండాయన్నారు. తద్వారా బంగారు పొలాలుగా మార్చిన “తెలంగాణ కోటి ఎకరాల మాగాణ” అన్నారు. ఈ మాటను పదేళ్లలో నిజం చేసి ధరణిపై దశాబ్ది కాలంలో శతాబ్ద మంతటి సాగునీటి అందించిన ఘనత కెసిఆర్ ది అన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు కేటాయించిన వాటాను సద్వినియోగం చేసుకుని 125 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ‘మిషన్ కాకతీయ’లో రాష్ట్రంలోని అన్ని మైనర్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిబిసి చైర్మన్ మనోహర్ రెడ్డి చేవెళ్ళ జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి శంకర్పల్లి జడ్పిటిసి వైస్ ఎంపీపీ కర్ణ శివప్రసాద్ అధికారులు ఆర్డీవో వేణు మాధవరావు చేవెళ్ళ తహసిల్దార్ శ్రీనివాసులు నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.