Tuesday, March 11, 2025
HomeతెలంగాణRamadugu: పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు

Ramadugu: పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు

గౌండ్లపల్లిలో కొత్తగా నిర్మించిన పోచమ్మ తల్లి గుడి ప్రతిష్ట సందర్భంగా పోచమ్మకు బోనాలు

రామడుగు మండలం మోతే గ్రామంలోని అనుబంధ గ్రామమైన గౌండ్లపల్లిలో కొత్తగా నిర్మించిన పోచమ్మ తల్లి గుడి ప్రతిష్ట సందర్భంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోచమ్మ తల్లి అనుగ్రహం గౌండ్లపల్లె గ్రామస్తులకు రామడుగు మండల ప్రజలందరికీ తల్లి దీవెనలు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. కార్యక్రమంలో గౌండ్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని తిరుపతి గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ మహేష్, మాజీ ఉప సర్పంచ్ బత్తిని మల్లేశం రుద్రారం గ్రామ సర్పంచ్ ఒంటేల అమరేందర్ రెడ్డి, సర్పంచ్ ల పోరం అధ్యక్షులు బండ అజయ్ రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News