Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: ఏఈటి లేబరేటరీస్ ఆధ్వర్యంలో స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Gudem Mahipal: ఏఈటి లేబరేటరీస్ ఆధ్వర్యంలో స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటి రూపాయలతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించిన జర్మనీ సంస్థ ఏఈటి లేబరేటరీస్

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో జర్మనీ దేశానికి చెందిన ఏఈటి లేబరేటరీస్ సంస్థ తమ సిఎస్ఆర్ ప్రాజెక్టులో భాగంగా కోటి రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని సంస్థ ప్రతినిధితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఈ విద్యా సంవత్సరం నుండి నోటు పుస్తకాలను సైతం పంపిణీ చేస్తోందని తెలిపారు.

- Advertisement -

పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నామని తెలిపారు. జర్మనీ సంస్థ ఏఈటి లేబరేటరీస్ కోటి రూపాయలతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ప్రకాష్ చారి, పరిశ్రమ ఎండిలు ఓలీవర్ స్క్రెడార్, క్రిస్టియన్ రూపో, సి ఎఫ్ ఓ స్వప్నాల్ సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News