నైరుతి రాకతో ఇక వర్షాలు ప్రారంభం కానున్నాయి. నైరుతి రుతుపవనాల మందగమనం వల్ల అండమాన్ లోనే ఆగిన రుతుపవనాలు కేరళ తీరంను ఎట్టకేలకు తాకాయి. దీంతో నైరుత ఆగమనం ప్రారంభమైంది. అతి త్వరలో కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇవి విస్తరించి, విస్తారంగా వర్షాలు కురిసేలా చేయనున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 3 లేక 4 రోజుల్లో తెలంగాణలో కూడా నైరుతి కారణంగా వర్షాలు ప్రారంభమవ్వటం ఖాయమని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. దక్షిణాది అంతా నైరుతిపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి అత్యంత కీలకం.