Sunday, October 6, 2024
HomeఆటNandyala: రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

Nandyala: రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

చదరంగం మెదడుకు పదును పెడుతుంది, ఈ క్రీడ బాలల్లో మానసిక వికాసానికి తోడ్పడుతుంది

ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో నంద్యాలలో రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో 19 సంవత్సరాల లోపు ఫిడే ర్యాంకింగ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ముఖ్యఅతిథిగా, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షులు కె.వి.వి.శర్మ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని, చెస్ క్రీడను పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Advertisement -


డాక్టర్ .జి .రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో చెస్ పోటీలు తరచూ నిర్వహించడం అభినందనీయమని, నంద్యాల జిల్లా చెస్ సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ర్యాంకింగ్ రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ తమ కళాశాలలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షులు కె.వి.వి. శర్మ మాట్లాడుతూ జువనైల్ జైల్లో ఉన్న బాలలకు, అనాధ బాలల వసతి గృహాలలో రాష్ట్రవ్యాప్తంగా చదరంగం క్రీడ లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ చెస్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొంటారని ప్రకటించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ ఛాంపియన్ షిప్ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని, నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయని, ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవంలో విజేతలకు పతకాలు, ట్రోఫీలు బహూకరించడం జరుగుతుందని తెలిపారు. సభానంతరం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి చెస్ బోర్డు పై పావులు కలిపి చదరంగం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షులు కె.వి.వి.శర్మ ను నంద్యాల జిల్లా సంఘం తరఫున, రామకృష్ణ విద్యా సంస్థల తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా క్రీడా ప్రాదేశిక అధికారి నరసింహారాజు, ఆంధ్ర రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి, నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, నంద్యాల రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్, కార్యదర్శి కూరా ప్రసాద్ ,కోశాధికారి రత్నకుమార్ , లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ సుధాకర్ రెడ్డి,వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర రెడ్డి, కర్నూల్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గోవింద జీయర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధికారి శేషి రెడ్డి, నిర్వాహకులు ఇమామ్ అధిక సంఖ్యలో సంఘం క్రీడాధికారులు, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News