Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: దర్గా యాత్ర ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే

Shilpa: దర్గా యాత్ర ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే

దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు అడుగడుగునా తోడ్పాటును, మానసిక స్థైర్యాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే శిల్పా


కర్ణాటక లోని సైదాపూర్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మైనారిటీ సోదరులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా వెలుగోడు, బండి ఆత్మకూరు గ్రామాలకు చెందిన సమీప బంధువులే. కర్ణాటక లోని గుల్బర్గా దర్గా ముస్లిం లకు పవిత్ర పుణ్య స్థలం. ప్రతి ఏటా అక్కడ జరిగే ఉర్సులో పాల్గొనాలని ఎందరో ముస్లిం లకు ఆకాంక్ష వెలుగోడు, బండి ఆత్మకూరు గ్రామ వాసులు అయిన బంధువులు షేక్ మునీర్, న్యామతుల్లా, రమీజా బీ కుటుంబాలు కూడా ఈ సారి ఆ ఉర్సులో పాల్గొనాలని భావించారు. ఒక తుఫాన్ వ్యాన్ ను బాడుగకు మాట్లాడుకున్నారు. మొత్తం 18 మంది మొన్న సోమవారం రాత్రి గుల్బర్గా బయలుదేరారు. తెల్లవారే లోపల గుల్బర్గా చేరుకోవాలి అని తలపెట్టారు. తెల్లవారు జామున 3 గంటల సమయం వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ అప్పటికే కర్ణాటక లోని సైదాబాద్ చేరింది. పిల్లలు, స్త్రీలు ఆదమరచి నిద్రిస్తున్నారు. మేలుకుని ఉన్న ఒకరిద్దరు మరో గంటన్నరలో గుల్బర్గా చేరుతాము అని భావిస్తున్నారు.
అయితే… ఆ సమయంలో వారికి తెలియదు. హైవే రోడ్డు పై నిలబెట్టిన ఒక లారీ రూపంలో మృత్యువు పొంచి ఉందని…. దర్గా చేరక ముందే ఆ అల్లా సన్నిధికి చేరుకుంటామని…
తెల్లవారు జాము కాబట్టి తుఫాన్ డ్రైవర్ కునికి పాటు తీశాడో ఏమో..! లేక అలసటతో ఆదమరచినడో ఏమో…! ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొంది. అంతే…. ఘోరం జరిగిపోయింది. తుఫాన్ బండి తునా తునకలైంది. అయిన వారి హాహా కారాలు మిన్నంటాయి. రక్త సిక్తం అయిన భీభత్స, భీతావహ పరిస్థితి. “అబ్బా జాన్… భాయ్ జాన్… అమ్మీ జాన్…” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా పెడబొబ్బల మధ్యన ఎవరు మృత్యు ఒడి చేరారో.. ఎవరు గాయపడ్డారో..!
ఒకరిని హత్తుకుని మరొకరు ఏడవటమే ఓదార్పు అయిన ఆ భయంకరమైన క్షణాలు… గుండెలవిసేలా రోదనలు చేస్తున్నా, సమయానికి అందని వైద్య సాయం….
హృదయ విదారకమైన ఆ దృశ్యాలు.. మబ్బులు కమ్మిన ఆకాశం విసిరిన చీకట్లలో అవిసి పోయాయి.

బాధితుల సమీప బంధువైన ఖాదరవలి ఈ దుర్ఘటన గురించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కు కాల్ చేసి చెప్పాడు. దీంతో చలించిపోయిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. వైస్సార్సీపీ వెలుగోడు పట్టణ అధ్యక్షులు ఇలియాస్ కు, అడ్వకేట్ సుబ్బారాయుడుకు కాల్ చేసి తక్షణమే బాదితుల వద్దకు వెళ్ళమని ఆదేశించారు. రాయచూరులో సరైన చికిత్స అందకపోతే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చమని సూచించారు. ఆ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు కాల్ చేసి బాధితుల కోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే సైదాబాద్ ఆసుపత్రి లో పోస్ట్ మార్దమ్ ఫార్మాలిటీస్ శీఘ్రగతిన పూర్తి అయ్యేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో క్షతగాత్రులను అంబులెన్సు ల్లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చేందుకు, అక్కడ మెరుగైన చికిత్స అందించేందుకు పావుగంటకోసారి వాకబు చేస్తూ ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకున్నారు. పోస్ట్ మార్దమ్ తర్వాత మృత దేహాలను వెలుగోడు, బండి ఆత్మకూరు చేర్చేందుకు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో ఆయన 90,000 రూపాయలు మేరకు సొంత నిధులు సమకూర్చారు. పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకురాలేక పోయినా, కర్నూల్ ఆసుపత్రి లో ఉన్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
కాగా, దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు అడుగడుగునా తోడ్పాటును, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఎమ్మెల్యే శిల్పా తీసుకున్న శ్రద్ధ పై నియోజకవర్గం ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా తన సొంత వారి కోసం అన్నట్లుగా తపించి పోయారని బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News