Monday, September 23, 2024
HomeతెలంగాణMuthireddy: చేర్యాలలో ఘనంగా 'చెరువుల పండగ'

Muthireddy: చేర్యాలలో ఘనంగా ‘చెరువుల పండగ’

తెలంగాణ రాష్ట్రానికి బకాయిలు లేవు అని నిరూపిస్తే మేము మాకుమ్మడిగా ప్రజాప్రతినిధులు అందరం రాజీనామా చేస్తామంటూ సవాల్

చేర్యాల మున్సిపాలిటీ. మండల పరిధిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరురా చెరువుల పండగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఊరూరా ప్రతి చెరువు కళకళలాడుతుందని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి బకాయిలు ఉన్న రెండు లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బకాయిలు లేవు అని నిరూపిస్తే మేము మాకుమ్మడిగా ప్రజాప్రతినిధులు అందరం రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. లేనిపక్షంలో మీరు రాజీనామా చేసి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరానీ శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, కౌన్సిలర్లు సతీష్, నరేందర్, యాట కనకవ్వ, తుమ్మలపల్లి లీల, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూర్మ వెంకటరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అంజలీదేవి ఆరోగ్య రెడ్డి, ముస్త్యాల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, తహసిల్దార్ షేక్ అలీఫా, కమిషనర్ గణేష్ రెడ్డి, మునిసిపల్ మేనేజర్ ప్రభాకర్, దేవస్థాన డైరెక్టర్లు సిద్ధిరాములు అమర్, తిరుపతి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News