Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: అమీన్పూర్ లో ఊరూరా చెరువుల పండుగ

Gudem Mahipal: అమీన్పూర్ లో ఊరూరా చెరువుల పండుగ

వందలాది మంది ప్రజల సమక్షంలో కోలాటాలు, పోతరాజుల విన్యాసాలు, బోనాలు, బతుకమ్మలు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పాయి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట పైన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరూర చెరువుల పండగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది ప్రజల సమక్షంలో కోలాటాలు, పోతరాజుల విన్యాసాలు, బోనాలు, బతుకమ్మలు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పాయి.

- Advertisement -

ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద చెరువు కట్టపై నిర్వహించిన సంబరాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చెరువులన్నీ జలకలతో కలకలలాడుతున్నాయని తెలిపారు. పెద్ద చెరువు కట్టను ఆధునిక వసతులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అనంతరం కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News