Saturday, November 23, 2024
HomeదైవంBasara Gnana Saraswathi temple: చదువుల తల్లి ఆశీర్వాదం మీ బిడ్డలకు ఇవ్వండి

Basara Gnana Saraswathi temple: చదువుల తల్లి ఆశీర్వాదం మీ బిడ్డలకు ఇవ్వండి

వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర,అనేవారు. ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా మారింది

మ‌నిషికి జ్ఞానం .. విజ్ఞానం చ‌దువుతోనే సాధ్య‌మ‌వుతుంది. వెల‌క‌ట్ట‌లేని విద్య‌ను .. జ్ఞానాన్ని ప్ర‌సాదించే చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తి. చ‌దువుల స‌ర‌స్వ‌తి కొలువైన దివ్య‌క్షేత్రం బాస‌ర‌. చిన్నారుల అక్ష‌రాభ్యాసాల‌కు
ఎంతో ప్ర‌ఖ్యాతి చెందిన ఆ .. బాస‌ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం …!

చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం దిన‌దినాభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తోంది. తమ పిల్లలకు భవిష్యత్‌లో అపారమైన విజ్ఞానం సొంతం కావాలని కోరుతూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టే తల్లితండ్రులతో ఈ బాసర క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది.
ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలంలోని గ్రామం. బాసర, నిర్మల్‌కు సుమారు 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంది . భారత దేశంలోని రేండే రెండు సరస్వతీ దేవాలయాలున్నాయి. ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండోది బాసరలోని జ్ఞాన సరస్వతి ఆల‌యం.

- Advertisement -

బాసర క్షేత్రం విశేషాలు

బాసరలో జ్క్షాన స‌ర‌స్వ‌తి వెలసిన ఈ క్షేత్రం ఎంతో .. పురాతన‌మైంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతీదేవిని వ్యాసుడు ప్రతిష్టించాడని పురాణాల క‌థ‌నం. తల్లి ఆశీసులతో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. అయితే, ఎన్ని ప్రాంతాల్లో తపస్సు చేసినా ఆయనకు తపో నిష్ట కల్గలేదంట.
దీంతో, ఆయన గోదావరి నది ఒడ్డున ఉన్న సరస్వతీ క్షేత్రాన్ని చేరుకుని తపస్సు ప్రారంభించాడట. ఆయన తపస్సు ఫలించి సరస్వతీ దేవి ప్రత్యక్షమై తనను అదే క్షేత్రంలో ప్రతిష్టించమని కోరిందట. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. దీంతో, వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు దీంతో వ్యాసుడు ఆ తీర్థానికి కొద్ది దూరంలో సరస్వతీదేవిని ప్రతిష్టించాడట. వ్యాసుడు ప్రతిష్టించిన కారణంగా ఈ క్షేత్రాన్ని వ్యాసపురగా పిలిచేవారట.


కాలగమనంలో వ్యాసపురమే బాసరగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణకాలంలో నిర్మించబడిన ఆలయం దండయాత్రల కాలంలో ధ్వంసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఆలయాన్ని పునర్నించి అమ్మవారిని పునఃప్రతిష్టించారట. ప్రస్తుతం బాసరలో ఉన్నది ఆ ఆలయమే.
ఆల‌యంలోని మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించార‌ని అంటారు.. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన ‘బాసర’ గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా, అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ప్ర‌జ‌లు గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించిన‌ మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.

దేవాలయం విశేషాలు
బాసరలోని సరస్వతీ దేవి ఆలయం సు విశాలమైన ప్రాంగణంతో ఎంతో సుంద‌రంగా ఉంటుంది. బాసర గ్రామం చిన్నదైనా ఆలయం మాత్రం భ‌క్తుల‌ను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం చేసి నదికి సమీపాన ఉన్న శివుని భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం ఆనవాయితీ. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తీ ఆల‌యం స‌మీపంలో గోదావ‌రి న‌ది ప్ర‌వ‌హిస్తోంది. గోదావరీ పుష్కరాల కారణంగా బాసర ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాగణంలో ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.


మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు – ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్థం
పూజ‌లు
ఆల‌యంలో ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు.


రూట్
హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ – మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News