భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలూరు నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిపిఐ మండల కార్యదర్శి పి రామాంజనేయులు అధ్యక్షత వహించారు. గిద్దయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలపై చిన్నచూపు చూస్తుందని, కర్నూల్ లో 20వేల మంది ఇండ్లు నిర్మించాలని లబ్ధిదారులకు చర్యలు తీసుకోవాలని ఆలూరు ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణమును త్వరగా ప్రారంభించాలని ఈనెల 15వ తేదీన వేదవతి ప్రాజెక్టు పనులను పరిశీలన చేస్తామన్నారు. 19వ తేదీన సంతకాల సేకరణ జింకల పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 21 తేదీల్లో పత్తికొండలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రారంభిస్తారని శిక్షణా తరగతులకు జిల్లా సమితి సభ్యులు మండల కార్యదర్శులు శాఖ కార్యదర్శి పాల్గొనాలని పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మద్దిలేటి శెట్టి విరుపాక్షి జిల్లా సమితి సభ్యులు దేవనకొండ మండల కార్యదర్శి నరసారావు కొలగుంద మండల సహాయ కార్యదర్శి మారెప్ప రైతు సంఘం నాయకులు హో తూరప్ప కృష్ణమూర్తి బ్రహ్మయ్య ఆంజనేయ రంగన్న తదితరులు పాల్గొన్నారు.
Aluru: వేదవతి ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
పార్టీ జిల్లా స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులకు హాజరవ్వండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES