Monday, September 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Balakrishna Bday: బాలయ్య బర్త్ డే వేడుకలు

Balakrishna Bday: బాలయ్య బర్త్ డే వేడుకలు

కె ఈ శ్యాంబాబు హాజరై కేక్ కట్ చేసి అభిమానులలో నూతన ఉత్సహాన్ని నింపారు

నందమూరి నటసింహ బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు స్థానిక తేర్ బజార్ లో నందమూరి బాలకృష్ణ ఫాన్స్ తాలూకా అధ్యక్షుడు సింగం శీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కె ఈ శ్యాంబాబు హాజరై కేక్ కట్ చేసి అభిమానులలో నూతన ఉత్సహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవలందిస్తూ ఎమ్మెల్యేగా సేవలందిస్తూ తెలుగు రాష్ట్రాలలో ప్రజల మన్నలను పొందూతున్న నాయకుడుగా ఎంతో మహోన్నతమైన సేవలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు సాంబశివరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రామనాయుడు, బత్తిన లోకనాథ్, మీరా హుస్సేన్, సోమ్లా నాయక్, వడ్డే ఉలిగన్న, తిక్క రమేష్, సురేంద్ర, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News