Sunday, October 6, 2024
HomeతెలంగాణGudem Mahipal: సిద్ధిపేటకు ధీటుగా పటాన్చెరు అభివృద్ధి

Gudem Mahipal: సిద్ధిపేటకు ధీటుగా పటాన్చెరు అభివృద్ధి

కొల్లూరు పోలీస్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహాయ సహకారాలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని సిద్దిపేటకు దీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కొల్లూరు పోలీస్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు.

- Advertisement -

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ కేటాయింపు సమస్యను మంత్రి హరీష్ రావు సహకారంతో పరిష్కరించుకొని ఆరు ఎకరాల విలువైన భూమిని తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందిస్తామన్నారు. కథ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మల్లికార్జున స్వామి, బీరప్ప, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు భూమి కేటాయించడంతోపాటు, దేవాలయాల నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మెరుగైన భద్రత అందించాలన్న సమన్నత లక్ష్యంతో మంత్రి హరీష్ రావు సహకారంతో కొల్లూరు కు నూతన పోలీస్ స్టేషన్ మంజూరు చేయించుకొని నేడు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అతి త్వరలో శాశ్వత భవన నిర్మాణానికి భూమిని కేటాయిస్తామన్నారు.

పటాన్చెరువు పట్టణంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు అతి త్వరలో శంకుస్థాపన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఉస్మాన్ నగర్ పరిధిలో ఐటీ పరిశ్రమల కోసం ఇప్పటికే భూమిని సేకరించడం జరిగిందని, త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి విజ్ఞప్తి మేరకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి ప్రభుత్వంతో చర్చించి కోట్ల రూపాయల స్థలాన్ని మున్సిపాలిటీకి అందించామన్నారు. -తెల్లాపూర్ ప్రజల కోరిక మేరకు మల్లన్న స్వామి, బీరప్ప, విశ్వకర్మ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక అభ్యున్నతి కోసం చేపట్టిన గొర్రె పిల్లల పంపిణీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాయి. గొల్ల కురుమల ఆత్మగౌరవం భవనాలు కోట్ల రూపాయలతో కోకాపేటలో సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలో వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాము.

కులవృత్తులకు జీవం పోసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసంత కల్పనకు మరిన్ని నిధులు కేటాయిస్తాము.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News