Saturday, November 23, 2024
HomeతెలంగాణSunke Ravi: 100 కోట్లతో చొప్పదండి మున్సిపాలిటీ అభివృద్ధి

Sunke Ravi: 100 కోట్లతో చొప్పదండి మున్సిపాలిటీ అభివృద్ధి

గతంలో 65 ఏళ్లు పాలించినటువంటి గత పాలకులు ఇప్పుడు దేశంలో పాలిస్తున్నటువంటి అనేక ప్రభుత్వాలు అభివృద్ధిని ఎందుకు చేస్తాలేరు

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుపెడుతూ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ గతంలో 65 ఏళ్లు పాలించినటువంటి గత పాలకులు ఇప్పుడు దేశంలో పాలిస్తున్నటువంటి అనేక ప్రభుత్వాలు అభివృద్ధిని ఎందుకు చేస్తాలేవని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ 9 సంవత్సరాల లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గతంలో తాగడానికి,సాగుచేసు కోవడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చెరువులను, కుంటలను నింపి నీటి సమస్య లేకుండా చేస్తున్నాడని అన్నారు.

- Advertisement -

ప్రపంచంలో రైతు చనిపోతే రూ. 5 లక్షల రైతు బీమా ఎక్కడైనా ఉందా అని ఇచ్చారా, ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు ఉచిత కరెంటు ఇచ్చి రైతుల పాలిట దైవం అయ్యాడని కొనియాడారు. దేశంలో అనేక ప్రభుత్వాలు పాలిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్నాయని ప్రజలు ఆలోచించాలని సూచించారు. దేశంలో రోల్ మోడల్ రాష్ట్రాలు ఉన్నాయని దేశ ప్రధాని అందించిన గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు ఇంకా అనేక సంక్షేమం పథకాలు అక్కడ అమలు అవుతున్నాయని ప్రజలు ఆలోచించాలని అన్నారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంను గతంలో ఎవరు పట్టించుకోక అభివృద్ధి జరగలేదని విమర్శించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామపంచాయతీ గా ఉన్న చొప్పదండినీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. చొప్పదండి పట్టణానికి రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని
ఆగస్టు 15 వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జీతాల కన్నా ఇతర రాష్ట్రాలలో తక్కువగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు గొప్పగా గౌరవ వేతనం ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన ప్రకారం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధించుకున్న తొమ్మిదేళ్ల పరిపాలనలో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News