Friday, November 22, 2024
Homeనేషనల్Elon Musk : ఎలన్ మస్క్‌ను వదిలిపెట్టని ఉద్యోగులు.. జాబ్‌లోంచి తొలగించినందుకు కేసు

Elon Musk : ఎలన్ మస్క్‌ను వదిలిపెట్టని ఉద్యోగులు.. జాబ్‌లోంచి తొలగించినందుకు కేసు

Elon Musk : ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ వరుసగా వివాదాలు ఎదుర్కొంటున్నాడు. కంపెనీ సొంతం కాగానే వేల మంది ఉద్యోగుల్ని తొలగించడం వివాదాస్పదమైంది. అయితే, ఈ అంశంపై ఉద్యోగులు మస్క్‌ను వదిలేలా లేరు. తమను ఉద్యోగంలోంచి తొలగించినందుకు అతడిపై కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు.

- Advertisement -

మస్క్ నిర్ణయం వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న చాలా మంది ట్విట్టర్, స్పేస్ ఎక్స్, టెస్లా, మస్క్‌కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక చోట్ల చాలా కేసులు నమోదయ్యాయి. తమను నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఒక్కటే కాదు.. మస్క్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కూడా కొందరు కేసులు దాఖలు చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు వల్ల ఆఫీస్‌లు ఖాళీ అయ్యాయి.

ఇప్పుడు వీటిని ఉద్యోగులు నిద్రపోయేందుకు వాడుకోవాలని మస్క్ భావిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా కూడా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో కేసు దాఖలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆఫీస్‌లను స్లీపింగ్ ప్లేస్‌గా మార్చాలని మస్క్ ప్రయత్నిస్తున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ‘‘ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త ఉద్యోగుల హక్కుల్ని కాలరాయాలని చూస్తున్నాడు. చట్టాన్ని అనుసరించకపోయినా పర్లేదు అనుకుంటున్నాడు. మేం అన్నింటికీ అతడిని జవాబుదారుడిని చేస్తాం” అని మస్క్‌పై కేసు దాఖలు చేసిన ఒక న్యాయవాది అన్నాడు. తొలగించిన ఉద్యోగుల్లో చాలామందికి నష్టపరిహారం రావాలని న్యాయవాది అభిప్రాయపడ్డాడు.

బోనస్, షేర్లు, ఎగ్జిట్ ప్యాకేజ్ వంటివి రావాల్సి ఉందని ఆయన అన్నాడు. ఉద్యోగుల్ని ఎక్కువ సమయం పని చేయాలని కోరడంపై కూడా కొందరు కేసులు దాఖలు చేశారు. కంపెనీలో మిగిలిన ఉద్యోగులు ఇకపై ఎక్కువ గంటలు పనిచేయాలని, అలా చేయడం ఇష్టం లేని వాళ్లు మూడు నెలల జీతం తీసుకుని వెళ్లిపోవచ్చని మస్క్ ఆదేశించాడు. దీన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా మస్క్ తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థకు లెక్కలేనన్ని న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News