తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ 2k రన్” కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విలీయమూన్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఊపి తెలంగాణ 2k రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఆర్డీఓ, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు, తాండూరు పట్టణ సీఐ, రూరల్ సీఐ, ఎస్ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికార ప్రతినిధి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.