Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: స్పందన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి

Nandyala: స్పందన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి

జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నాణ్యతతో వేగంగా పరిష్కరించాలన్నారు

జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సీరియస్ గా తీసుకొని ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లాధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నాణ్యతతో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సమస్యను పారదర్శకంగా అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని నమోదైన దరఖాస్తులను 24 గంటల్లో ఓపెన్ చేసి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు1)గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామంలో ఎస్సీ కులస్థులమైన 90 కుటుంబాల వారం ఎంతో కష్టపడి సీఎస్సై చర్చిని నిర్మించుకున్నామని… ప్రస్తుతం 167కే రోడ్డు నిర్మాణంలో చర్చి సగ భాగం పోయే అవకాశం ఉన్నందున రోడ్డు నిర్మాణము 10 మీటర్లు తూర్పు వైపునకు మళ్ళీంచి మా సమస్య ను పరిష్కరించాలని కోరుతూ ఒంటివెలగల గ్రామ ఎస్సీ కులస్థులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.2) డోన్ మండలం కమలాపురం గ్రామ వాస్తవ్యుడు ఎన్.లక్ష్మి శేఖర్ కుమార్తె ఎన్. లక్ష్మి సాహిత్యకు ప్యాపిలిలో డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతికి ప్రవేశ పరీక్ష రాస్తే తనకు 37/50 మార్కులు వచ్చినప్పటికీ సీట్ రాలేదని… నా కూతురికి గురుకుల పాఠశాల యందు సీటు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. 3) జూపాడుబంగ్లా మండలం తంగెడంచ గ్రామ కాపురస్తురాలు ఎం.మల్లేశ్వరి w/o మద్దిలేటి నాకు ఇద్దరు పిల్లలు నాకు ఆరోగ్యం సరిగ్గా లేక కాళ్ళు, చేతులు పని చేయడం లేదని…నా భర్త నన్ను, నా పిల్లలను పోషించకుండా వదిలివేసి వెళ్లారని పెన్షన్ మంజూరు చేసి నాపిల్లలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 235 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లాస్థాయి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News