Tuesday, November 26, 2024
HomeతెలంగాణYadadri: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చిరుమర్తి

Yadadri: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చిరుమర్తి

ఎన్నారం గ్రామం మీద అపారమైన ప్రేమతోనే ఎక్కువ నిధులిచ్చాం

రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ సంక్షేమ పథకం పేదోడికి ఆసరా అవుతున్నాయి, గతంలో మునుపెన్నడూ చెయ్యని అభివృద్ధి కేవలం కేసీఅర్ తోనే సాధ్యమైంది.. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వెయ్యని దమ్మున్న నాయకుడు కేసీఅర్..ఎంత నష్టమైనా రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ కేసీఅర్ సారథ్యంలో రాష్ట్రంలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతీ గ్రామం సుభిక్షంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అని ఎన్నారం గ్రామం మీద అపారమైన ప్రేమతోనే ఎక్కువ నిధులిచ్చాం అన్ని విధాలుగా ఎన్నారం గ్రామం ముందుండాలనే 1 కోటి పై చిలుకు నిధులు గ్రామానికి కేటాయించామని 22 లక్షలతో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేశాం, గ్రామస్థులందరి తోడ్పాటుతోనే ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.
మీ అందరికి తోడుగా దేవాలయ పునర్నిర్మాణానికి నా వంతుగా 5 లక్షలు విరాళం ఇస్తానని తెలిపారు. పార్టీలకు అతీతంగా కెసిఆర్ ప్రభుత్వానికి గ్రామాభివృద్ధిలో అండగా ఉండాలని కోరారు ఎన్నారం గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబోయిన జ్యోతి బలరాం సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి పిట్ట కృష్ణారెడ్డి చెరుకు సోమయ్య ఎంపీటీసీలు ఏనుగు జయమ్మ వెంకట్ రెడ్డి దోమల సతీష్ ఉప సర్పంచ్ బిక్షం గ్రామ శాఖ అధ్యక్షుడు కొండూరు శంకర్ నాయకులు సుధాకర్ రెడ్డి ఆవుల శ్రీధర్ గర్దాస్ విక్రమ్ జానీ ఎన్నారం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News