Friday, November 22, 2024
Homeహెల్త్Lemon peel: 'తొక్కలో' ఎన్ని సుగుణాలో!

Lemon peel: ‘తొక్కలో’ ఎన్ని సుగుణాలో!

నిమ్మతొక్కల్లో ఉండే బయొఫ్లేవనాయిడ్స్ ఎముకలను ద్రుఢంగా ఉంచడంతో పాటు శరీరంలోని మలినాలను పోగొడతాయి

తొక్కే కదా అని పారేయొద్దు…

- Advertisement -

వంటకాల్లో నిమ్మరసం ఎంత ముఖమో నిమ్మ తొక్కలు కూడా అంతే ఉపయోగకరమట. అందుకే నిమ్మతొక్కలను తొక్కే కదా అని తీసిపారేయొద్దంటున్నారు చెఫ్స్, పోషకాహారనిపుణులు. వీటిల్లో సువాసనలు చిందించే గుణంతో పాటు మరెన్నో పోషకాలు కూడా దాగున్నాయంటున్నారు వీళ్లు. నిమ్మ తొక్కల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. నిమ్మతొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది మనలో రోగనిరోధకశక్తిని పెంచి పలు రోగాలను అధిగమించే శక్తినిస్తాయిట. ఈ నిమ్మతొక్కల్లో ఉండే బయొఫ్లేవనాయిడ్స్ ఎముకలను ద్రుఢంగా ఉంచడంతో పాటు శరీరంలోని మలినాలను పోగొడతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి కూడా. అంతేకాదు నిమ్మతొక్కల్లో యాంటీబాక్టీరియల్ కాంపొనెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. దంతక్షయం నుంచి రక్షిస్తాయి. నిమ్మతొక్కల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో తోడ్పడతాయి. అంతేకాదు బ్లడ్
షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తాయిట కూడా. నిమ్మతొక్కల్లో ఉండే పీచుపదార్థం మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణమయ్యేట్టు సహకరిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడం తోపాటు బరువు పెరగకుండా కూడా నియంత్రిస్తాయిట.

అలాంటి నిమ్మ తొక్కలను మనం తీసుకనే డైట్ లో ఎలా భాగం చేయచ్చంటే తొక్కలను గ్రేట్ చేసి దాన్ని సలాడ్, సూప్, డెజర్టు లలో వేసుకోవచ్చు. ఇలా చేస్తే అవి మంచి సువాసనలు చిందిస్తాయి. వాటిని తినేటప్పుడు ఎంతో తాజాదనాన్ని కూడా ఫీలవుతాము. ఎండబెట్టిన నిమ్మతొక్కల పొడిని ఎన్నో రకాల రెసిపీల్లో సైతం వాడతారు. నిమ్మతొక్కలను ప్రిజర్వేటివ్స్ లలో కూడా వాడతారు. ఉదాహరణకు పచ్చళ్లు, సాస్ లు, డిప్స్ లలో వాడే నూనె, వెన్న, సుగర్లలో నిమ్మ తొక్కల ఎసెన్స్ కలుపుతారు. అంతేకాదు రోజ్ మేరీ వంటి సుగంధమూలికలతో పాటు నిమ్మ తొక్కలను కూడా పదార్థాలపై ‘స్ప్రెడ్స్’గా వాడతారు. దీంతో ఆ పదార్థాలకు ఒక టాంజీ రుచి వస్తుంది. ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడిని రకరకాల నాన్ వెజ్ వంటకాల్లో సైతం వాడతారు. వాటితోపాటు డెజర్టులు, కాక్ టైల్స్, ఇంట్లో తయారుచేసుకునే స్పైసీ బ్లెండ్స్ లో కూడా వాడతారు. మీరు వండిన డిష్ కు లెమనీ రుచిని జోడించాలనుకుంటే నిత్యం వాడే మసాలాకు మల్లే నిమ్మ తొక్కల పొడిని కూడా వాటిలో వాడొచ్చు. ఇంకా పొగలు కక్టే టీ నీళ్లల్లో నిమ్మ తొక్కను, కాస్త దాల్చినచెక్క ను వేసి ఒడగట్టి అందులో తేనెను జోడించి నిమ్మ టీని చేయొచ్చు. ఈ టీ తాగినపుడు ఎంతో తాజాదనాన్ని ఫీలవుతారంటున్నారు పోషకనిపుణులు సైతం. అందుకే నిమ్మ తొక్కే కదా అని పారేయొద్దుసుమా…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News