ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసుల్లో జైలు జీవితాన్ని అనుభవించిన ఉద్యమ కెరటం డాక్టర్ సంపత్ నాయక్ ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో వైరా నియోజకవర్గాన్ని ఇన్చార్జిగా డాక్టర్ సంపత్ నాయక్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేశారు.. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి తనపై ఉన్న నమ్మకాన్ని కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నాకు ఇంతటి మంచి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ వైరా నియోజకవర్గ ప్రజలకు ఇకనుండి అందరికీ సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని వారి కష్టాలపై అన్ని విధాలుగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటానని త్వరలో వైరా నియోజకవర్గంలో పార్టీ ఆఫీసుని ప్రారంభించి వైరా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలియజేశారు… అదేవిధంగా వైరా నియోజకవర్గ మొత్తం త్వరలో పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతూ భవిష్యత్ కార్యాచరణ మరికొన్ని రోజుల్లో తెలియజేస్తామని సంపత్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ నాయకులు కట్ల రామకృష్ణ ,శ్రీకాంత్ ,శివ ,కృష్ణ నాయుడు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు..