Saturday, October 5, 2024
HomeతెలంగాణPilot Rohit Reddy: మహిళలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అండ

Pilot Rohit Reddy: మహిళలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అండ

అత్యున్నత ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమంలో ప్రణాళికను రూపొందించుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది

మహిళలు తల్లి బిడ్డల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం అని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ సంబురాల కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజన పథకం 56% అంగన్వాడి కేంద్రాల్లో మాత్రమే అమలయ్యేదని, 25 రోజులు మాత్రమే పాలు, గుడ్లు పంపిణీ చేసేవారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలకు ప్రతిరోజు పప్పు ఆకుకూరలు గుడ్డు పాలతో ఒక పూట సంపూర్ణ భోజనం మరియు ఐరన్ ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మాత్రల పంపిణీ, ఆరోగ్య తనిఖీలు గర్భిణీల బరువు పర్యవేక్షణ, ఇంటింటికి అంగన్వాడీ కౌన్సిలింగ్ లాంటి సేవలను ప్రారంభించడం జరిగింది. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజు గుడ్డు, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, 7 నెలల నుండి 3 సంవత్సరాల వయసు పిల్లలకు బలవర్ధకమైన బాలమృతం, గుడ్డు విటమిన్ ఏడి తో కూడిన నాణ్యమైన ఫోర్టిఫైడ్ పాలు వంటి నాణ్యమైన ఆహార పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల మంది పిల్లలకు ప్రీస్కూల్ విద్య అందించడం జరుగుతుంది. దేశంలో అత్యున్నత ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమంలో ప్రణాళికను రూపొందించుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అంగన్వాడి టీచర్లు,పిల్లలు మరియు కుటుంబాలకు టి స్యట్ చానల్ ద్వారా కోవిడ్ 19 సమయంలో ప్రీ స్కూల్ కార్యకలాపాలు ఏర్పాటు చేసి విద్యను అందించారు. ఇది దేశంలోనే వినూత్నంగా చేసిన కార్యక్రమం అని అన్నట్టు. అంగన్వాడి కేంద్రాల సిబ్బంది వేతనం అంగన్వాడి కేంద్రాల్లో సేవలు సమర్ధవంతంగా అందించేందుకు అంగన్వాడి సిబ్బందికి అందించే గౌరవ వేతనాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 300% పెంచారు. అంగన్వాడి టీచర్ వేతనం రూ.4200 నుండి రూ.13650 కి పెంపు. అంగన్ వాడి హెల్పర్ వేతనం. రూ.2200 నుండి 7800 కి పెంపు. అంగన్వాడి కార్యకర్తను అంగన్ వాడి టీచర్ గా గౌరవప్రదమైన స్థాయికి చేర్చడం జరిగింది. అనాధలు నిరాదరణకు గురైన పిల్లలను రక్షించడానికి రాష్ట్రంలో 17 శిశుగృహాలు 35 బాల సదనాలు 7 జువైనల్ హోమ్స్ ఏర్పాటు చేయబడినవి.

- Advertisement -

పిల్లల పరిరక్షణ భద్రత కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బాల రక్షక భవనాలు ఏర్పాటు అయినవి. ఆపదలో ఉన్న పిల్లలను వెంటనే రక్షించడానికి బాల రక్షక వాహనం ఏర్పాటు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం. మహిళ రక్షణ భద్రతా మరియు నైపుణ్యాభివృద్ధి. బాధిత మహిళలకు సమీకృత సహాయ సేవలను 24 గంటలు,365 రోజులు అందించడానికి 33 జిల్లాల్లో ఇవి పని చేస్తున్నాయి. లైంగిక హింసకు గురైన పిల్లలు, మహిళలకు అవసరమైన సేవలను అందించడం కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
మహిళల హెల్ప్ లైన్.. 181 బాధిత మహిళల కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 24 గంటలు,365రోజులు సేవలు అందించబడుచున్నది. షి టాక్సీ… ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల భద్రత మరియు మహిళల ఉపాధి కోసం మహిళ డ్రైవర్లకు ట్యాక్సీలు సబ్సిడీలో అందించబడతాయి. మహిళల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మోటార్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం హైదరాబాదులో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. సాధించిన ఫలితాలు… తెలంగాణ రాష్ట్ర శిశు మరణాల రేటు 39 (2014) నుండి 21 (2020) కి తగ్గింది.

తెలంగాణ రాష్ట్రం మాతృ మరణాల రేటు 92 (2014) నుండి 43 (2020)కి తగ్గింది. లింగ నిష్పత్తి (1000 మంది పురుషులకు స్త్రీలు) 1,007నుండి 1,049కి మెరుగుపడింది. గృహహింసను అనుభవించిన 18-49 సంవత్సరాల వివాహిత మహిళలు 42.9% నుండి 36.9% కు తగ్గారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, ఆర్డీవో, మండల ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీలు, సెర్ఫ్ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులు, మహిళా సంఘాలు,మరియు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News