Saturday, November 23, 2024
HomeతెలంగాణThalasani: మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది

Thalasani: మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది

అన్ని రంగాలలో మహిళలకు సముచిత స్థానం

మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగంలో ఆశ వర్కర్లు, గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల సంరక్షణలో అంగన్ వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని పేర్కొన్నారు.

- Advertisement -

విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో, స్థానిక సంస్థలు, చట్ట సభలలో అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులను కాపాడుతున్నట్లు చెప్పారు. తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంగన్ వాడీల వేతనాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 300 శాతం పెంచి వారి గౌరవాన్ని మరింత పెంచడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ అధికారి సునంద, నోడల్ అధికారి రాజేందర్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డిసి ముకుంద రెడ్డి, సఖి కేంద్రం అధికారి అనితా రెడ్డి, యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నీరజ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News