Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Ocean waters: జీవ కోటికి సముద్ర జలమే జీవనాధారం

Ocean waters: జీవ కోటికి సముద్ర జలమే జీవనాధారం

మనుషుల స్వార్థం పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం వల్ల సముద్రం నీరు కాలుష్యంమై సముద్రంలో ఉన్న జీవులు అంతరించిపోతున్నాయి

మానవుడు నివసించే భూగ్రహంపై 29 శాతం మాత్రమే భూమి ఉన్నది. 71 శాతం సముద్రము నీరు వుంది మిగిలినదంతా సముద్రపు నీటి ద్వారా ఆవరించబడి ఉంది. ఈ గ్రహంలో జీవులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. కడలిని కాపాడుకోవడం అందరి బాధ్యత. జీవరాశికి రక్షణ ఆహార పంటలు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమవు జల వనరులను సమకూర్చే సముద్రాలు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగించి కడలిలో పడేస్తున్నారు. మనుషుల స్వార్థం పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం వల్ల సముద్రం నీరు కాలుష్యంమై సముద్రంలో ఉన్న జీవులు అంతరించిపోతున్నాయి. సాగర జలం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయన్న విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలు విస్మరిం చడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యత గుర్తించి మానవ వనరుల వికాసంలో సముద్ర వనరుల పాత్ర గురించి ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్లాస్టిక్ల వ్యర్ధాలు ‘డ్రైనేజీ’ చెత్త పారిశ్రామిక వ్యర్థ పదా ర్థాలు సముద్రాలలో విచ్చల విడిగా పడేస్తున్నారు. అనేక దేశాలు పారిశ్రామిక వ్యర్ధాలను నౌకలలో తరలించి సముద్రాల్లో పడేస్తున్నారు. వేల కొద్ది టన్నుల చెత్త సముద్ర గర్భంలో కలిసిపోయి కాలుష్య కారకాలు పెరిగిపోతున్నా యి. సముద్రాలలో పడేసిన ప్లాస్టిక్‌ భూమిలో కరగక ఈ ప్లాస్టిక్‌ కాలుష్యకారకంగా తయారై సముద్రంలో ఉన్న చేపలు ఇతర జీవరాసులు అంతరిస్తున్నాయి.
జల కాలుష్యం అంతరిస్తున్న జీవరాశులు
నీటి కాలుష్యం వల్ల జీవజాతులు అంతరించిపోవడం వల్ల జీవావరణం పర్యావరణం దెబ్బతింటుంది. సముద్రా లను రక్షించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఉదా సీనతను నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి. ప్రభుత్వాల చర్యలు తుతు మంత్రంగా వుండడం గమనార్హం సముద్ర రక్షణ దినోత్సవం రోజు ప్రభుత్వాలు సముద్రాన్ని కాపాడుకోవా ల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తు న్నారు ప్రపంచ సముద్ర దినోత్సవం పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి 45 దేశాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. బ్రెజిల్‌ లోని రియో డిజనిరో నగరంలో 1992 ఐక్యరాజ్యసమితి సముద్రాలపై అవగాహన పెంచడానికి సదస్సును నిర్వహించింది 2008లో తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది సముద్రాలు బాగుండాలి, జీవులు బాగుండాలి. ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సవం థీమ్‌గా ఎంపిక చేశారు.
ప్రభుత్వాలు ’పౌర సమాజం సముద్ర జలాల రక్షణను విస్మరిస్తునాయి. సముద్రపు నీరు కలుషితానికి గురి అవుతుంది. చాలా దేశాల్లో వ్యర్ధాలను సముద్రంలో కలుపుతున్నారు
సముద్రాల వల్ల అనేక రకాల ప్రయోజనాలు పర్యా వరణం రక్షించబడుతుంది. బీచ్‌ లో వంటి నీటి వనరుల చుట్టు మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది దీంతో సముద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం ఉంది ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పించడం సముద్రాల సుస్థిర అభివృద్ధి ద్వారానే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధనకు కృషి చేసే విధంగా సదస్సులు చర్చలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తారు.
సముద్రం నీరు ప్రాముఖ్యత
ప్రాముఖ్యత సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డాటా తెలుపుతుంది. మహా సముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్డయాక్స్‌డును గ్రహిస్తాయని ఇవి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం తగ్గిస్థాయిని రుజువు చేసింది. చెత్త ‘మురుగు ‘చమురు’ లీకేజీ అవకా శం ఉంది ఈ విషయాల పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి. ముందు జాగ్రత్తలు తీసుకునేట్లు చైతన్య పరచడం.
కలుషితమౌతున్న సముద్రాలు
సముద్రాలు ప్రపంచంలో కోట్లాది మందికి జీవనో పాధిని పౌష్ఠికాహారం అందిస్తూ జీవరాశుల మనుగడకు దోహద పడుతున్నాయి. ప్రపంచ పటంలో 3 వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ కాలక్రమేణా అవి కాలుష్యం బారిన పడుతున్నాయి. మానవుడు సముద్ర జలాలను కలుషితం చేస్తూ సముద్ర జీవుల మనుగడకు ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాడు.
సామాజిక ఆర్థిక వేత్తల ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిపో తుంది. ప్లాస్టిక్‌ సంచులు ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తున్నాయని అందరికీ తెలిసిన వాటి వినియోగాన్ని నియంత్రించడానికి సమగ్రమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోకపోవడం పౌరుల్లో ప్లాస్టిక్‌ వల్ల వచ్చే ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడం ప్లాస్టిక్‌ వినియోగంలో ప్రపంచ మానవాళి తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ శరీర నిర్మాణంలో ప్రోటిన్లు కీలకపాత్ర వహిస్తాయి. అలాంటి ప్రోటీన్లను అందజేసే సత్తా ఒక సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో ఐదు ట్రిలియన్‌ మైక్రో ప్లాస్టిక్‌ ఉన్నాయని వీటిని సముద్ర జీవులు (చేపల వంటివి) మింగడం వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు క్యాన్సర్ల పాడిన పడుతున్నారని వైద్య ఆరోగ్యసర్వేలు తెలియజేస్తున్నాయి. 2025 సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ చేపుల నిష్పత్తి ఒకటి నిష్పత్తి1:3 గా ఉంటుందని అంచనాలు తెలుపుతున్నాయి అనేక దేశాలు వ్యర్థ జలాలను సముద్రంలోకి విచక్షణ రహితంగా వదులుతున్నాయి త్వరలో విశ్వవ్యాప్తంగా సముద్రంలో కలుస్తున్న డ్రైనేజీ వాటర్‌ లో 70% శుద్ధి చేయ నంధున సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. సముద్ర వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దీనివల్ల ప్రతి ఏటా 13 మిలియన్‌ డాలర్ల నష్టం జరుగుతుంది. అని యు ‘ఎన్‌’ ఇ’ పి అంచనా వేసింది.
ప్లాస్టిక్‌ వ్యర్ధాల్లో భారత్‌ అగ్రస్థానం
ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్‌ చైనా వాళ్లు ముందు వరసలో ఉండటం శోచనీయం. మన దేశంలో సాలీన ప్లాస్టిక్‌ వియోగం 15 మిలియన్‌ టన్నులు ఇది 2050నాటికి 20 మిలియన్ల టన్నులు అవుతంది. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించక పోతే సముద్రాల్లో ఉండే చేపల బరువు కన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువు ఎక్కువ ఉంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పశ్చిమబెంగాల్లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వినియోగిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధ నలు జరగాల్సిన అవసరం ఉంది మనకన్నా అభివృద్ధిలో ఆర్థికంగా వెనకబడిన దేశాలైన బాంగ్లాదేశ్‌ రువాండా కీన్యాయలో ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాల్లోకి ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వదలడం ఆపకపోతే చేపల కన్నా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ వినియోగం మీద నిషేధం విధించాలి. పర్యావరణ హితకరమైన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చెయ్యాలి. ప్రకృతి పర్యావరణ రక్షణకు సముద్రాల రక్షణ కు సమగ్రమైన చట్టాలు రూపొందించి అమలు చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడలిని కాపాడుకుంటెనే మానవ మనుగడ సాధ్యమౌతుంది.= అన్న వాస్తవాన్ని గ్రహిం చి సముద్ర జలాలను కాలుష్యం కాకుండా తక్షణ కార్యాచరణ ప్రణాళికలను అమలు చెయ్యాలి. పౌరసమాజం ‘మహిళా’ యువజన సంస్థలు సామా జిక సేవా సంస్థలు సముద్ర జలాల రక్షణ వినియోగం ప్రయోజనాల మీద ప్రజలకు అవగాహన కలిగించాలి. సముద్రాలు బా గుండాలి జీవులు బాగుండాలి అనేది నినాదం కాకుండా ప్రభుత్వాల విధానం కావాలని ఆశిద్దాం.

  • నేదునూరి కనకయ్య
    తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు
    కరీంనగర్‌, 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News