Friday, November 22, 2024
Homeఫీచర్స్Body & Bath: రోజూ స్నానం చేస్తారా? అయితే జాగ్రత్త !

Body & Bath: రోజూ స్నానం చేస్తారా? అయితే జాగ్రత్త !

పదే పదే స్నానం చేయటం, అతిగా శుభ్రత పాటించటం, అతిగా లోషన్స్-క్రీమ్స్ రాయటం, స్క్రబ్బింగ్ పదేపదే చేయటం చాలా డేెంజర్

స్నానం చేసేటప్పుడు ఈ పొరబాట్లు చేయొద్దు..
స్నానం చేసేటప్పుడు మనం తెలియకుండా కొన్ని పొరబాట్లు చేస్తుంటాం. మీ శరీరం, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పొరబాట్లను చేయకూడదు. ఇంతకూ ఆ పొరబాట్లు ఏమిటంటే…
 మనలో చాలామందిమి బాగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తుంటాం. అలా చేసేటప్పుడు శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ బాగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంలో స్రవించే సహజమైన నూనెపదార్థాలు పొడాబారిపోతాయి. చర్మ రంధ్రాలు బాగా తెరుచుకుని చర్మానికి కావలసిన తేమ లేకుండా పోతుంది. అందుకే బాగా వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం బెస్ట్ అని సూచిస్తున్నారు.
 స్నానం చేస్తే హాయిగా ఉంటుందని రోజుకు రెండు మూడుసార్లు స్నానం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల కూడా చర్మం పొడిబారిపోతుందిట. దీంతో శరీరంలో ఉండే సహజ నూనె పదార్థాలు, మాయిశ్చరైజర్ గుణాలు పోతాయిట. అందుకే కొందరు చర్మనిపుణులు సైతం రోజుకు ఒకసారి స్నానం చేస్తే ఎక్కువేనని
అభిప్రాయపడుతుంటారు కూడా. వ్యాయామాలు చేసేవాళ్లు, చెమట బాగా కారే వాళ్లు రోజులో రెండవసారి
స్నానం చేయాల్సి ఉంటే ఎక్కువ టైము షవర్ చేస్తూ గడపకుండా తొందరగా ముగించుకుంటే బెస్టు అని
సూచిస్తున్నారు.
 శరీరం శుభ్రంగా ఉండడం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటాం. ఇందువల్ల చర్మం ఇరిటేషన్ కు గురి అవుతుందంటున్నారు నిపుణులు. అందుకే మీరు వాడే బాడీ వాష్ లో ఎలాంటి పదార్థాలు వాడేరో చదవకుండా ఆ ఉత్పత్తులను వాడొద్దంటున్నారు. ఉదాహరణకు మీరు క్లీన్సర్లను తీసుకుంటే చాలావాటిని రకరకాల సువాసనలు వెదజల్లేవిగా తయారుచేస్తున్నారు. వాటిల్లో ప్రిజర్వేటివ్స్, సల్ఫేట్స్ వాడతారు. ఇవి చర్మంపై ఇరిటేషన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సున్నితమైన, పగుళ్లతో కూడిన పొడి చర్మం ఉన్న వారికి ఇవి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి.

- Advertisement -


 స్నానానికి హార్డ్ వాటర్ ఉపయోగిస్తుంటారు చాలామంది. ఇది కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ వాటర్ ను ఫిల్టర్ చేయకపోవడం వల్ల చర్మం, శిరోజాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటి టెక్స్చెర్ దెబ్బతింటాయి. ముఖ్యంగా ఫిల్టర్ చేయని వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. చర్మంపై, జుట్టులో వీటి మిగులు పదార్థాలు చేరతాయి. దీనివల్ల డ్రైనెస్, ఇరిటేషన్ సమస్యలు తలెత్తుతాయి. హార్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోలేము కూడా. దీంతో చర్మం కాంతివిహీనంగా, పొడిబారినట్టు, పగిలినట్టు తయారవుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే మీరు హార్డ్ వాటర్ తో స్నానం చేస్తుంటే టి3 సోర్స్ షవర్హెడ్ ఉపయోగించమంటున్నారు వైద్యులు. ఇది మీరు స్నానం చేసే హార్డ్ వాటర్ లోని క్లోరిన్ తో పాటు మురికిని కూడా పోగొడుతుంది. అంతేకాదు చర్మం దుర్వాసన రాకుండా పరిరక్షిస్తుందంటున్నారు.
 మనలో చాలామంది స్నానం చేసిన తర్వాత ఒళ్లు తుడుచుకోవడానికి ఒకే తువ్వాలును నాలుగైదు రోజులు వాడుతుంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదు. ఒళ్లు తుడుచుకోవడానికి మీరు ఎలాంటి ఫాబ్రిక్ మెటీరియల్ నైనా వాడొచ్చు కానీ అప్పటికే తుడుచుకున్న తువ్వాలుతోనే మళ్లా మళ్లా ఒళ్లు తుడుచుకోవడం అస్సలు మంచిది కాదని చర్మనిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇలాంటి తువ్వాళ్లపై బాక్టీరియా తొందరగా వచ్చి చేరుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా చర్మ సంబంధమైన ఫంగస్ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

 బాత్రూములోని వేడి వాతావరణం లో బాక్టీరియా బాగా చేరుతుంది. అందుకే ఎక్స్ ఫొయిలేషన్ కోసం బాక్టీరియా ఇన్ఫెస్టెడ్ ఉత్పత్తులను వాడడం వల్ల మరింత అధికంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవడానికి మనం బాగా ప్రాధాన్యం ఇస్తాం. దీనివల్ల చర్మంపై చేరిన మ్రుత కణాలు పోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మీరు గనుక ఈ ప్రక్రియను శరీరంపై, ముఖంపై వారానికి రెండు నుంచి మూడు పర్యాయాలు చేయడం వల్ల చర్మానికి చేటేనని గుర్తుంచుకోండంటున్నారు చర్మనిపుణులు. ఇలా అతిగా ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియ చేయడం వల్ల చర్మం లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో చర్మం ద్రుఢత్వం బలహీనపడుతుంది. కొన్నిసార్లు చర్మం వాపుకు సైతం గురవుతుంది కూడా. అప్పుడు చర్మం బలాన్ని కోల్పోయి తొందరగా సూక్ష్మక్రిముల బారిన పడి తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. దీంతో చర్మం బాగా సున్నితంగా తయారయి ఇరిటేషన్ కు లోనవుతుంది.
 స్నానం చేసుకునేటప్పుడు హెయిర్ షేవింగ్ చేసుకుంటుంటాం. అప్పుడు రేజర్ అన్ని డైరక్షన్లలోకి వెళ్లే
అవకాశం ఉంది. అలా కాకుండా ఎక్కడ షేవింగ్ అవసరమో ఆ మేరే రేజర్ అప్లై అయ్యేలా జాగ్రత్తగా షేవింగ్ చేసుకోవాలి. లేకపోతే అన్నిచోట్లలోకి బాక్టీరియా వ్యాపించి ఇరిటేషన్ తలెత్తుతుంది. షేవింగ్ చేసుకునేటప్పుడు ఆ ప్రదేశంలో హెయిర్ పూర్తిగా పోయేలా జుట్టు ఉన్న దిశలోనే రేజర్ ను జాగ్రత్తగా అప్లై చేయాలి. లేకపోతే ఇన్ఫెక్షన్, ఇరిటేషన్లు తలెత్తుతాయి. అలాగే ఉపయోగించే రేజర్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉపయోగించిన బ్లేడ్స్ రేజర్ లో ఉండడం, అవి వాడి చాలాకాలం కావడంతో అందులో బాక్టీరియా చేరి రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవతుందని నిపుణులు సూచస్తున్నారు. ముఖ్యంగా డల్ గా, మురికిగా ఉన్న రేజర్లు వాడారంటే కోరి ఇన్ఫెక్షన్లను ఆహ్వానిస్తున్నారన్నమాట. అందుకే ఐదు లేదా ఏడు షేవ్స్ అవగానే మీ రేజర్ బ్లేడ్లను మార్చడం మంచిది. లేదా మీరు ఎంత తరచుగా దాన్ని వాడతారన్న దాన్ని బట్టి నెలకు ఒకసారి మీ రేజర్ బ్లేడ్ ను మార్చాల్సి ఉంటుంది.
 చాలామందిలో స్నానం అయిన వెంటనే మాయిశ్చరైజింగ్ చేసుకునే అలవాటు ఉండటం లేదు. స్నానం అయిన వెంటనే మాయిశ్చరైజింగ్ చేసుకోవడం వల్ల చర్మానికి బాగా హైడ్రేషన్ అందుతుంది.
మాయిశ్చరైజింగ్ ఆలస్యంగా చేసుకున్న దానికంటే కూడా స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజింగ్ చేసుకోవడం వల్ల చర్మానికి అధికమొత్తంలో హైడేష్రన్ అందుతుందని చర్మనిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కాళ్లను షేవ్ చేసుకున్నప్పుడు స్నానం చేయగానే వాటికి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలంటున్నారు. షేవింగ్ అనంతరం చర్మానికి సరిగా మాయిశ్చరైజర్ పెట్టుకోకపోతే చర్మం ఇరిటేషన్ కు, వాపుకు లోనయ్యే అవకాశం ఉంటుందని చర్మనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే రేజర్ బర్న్ అంటారు. స్నానం చేసిన తర్వాత పెట్రోలియం బేస్డ్ మాయిశ్చరైజర్ ను స్కిన్ కు అప్లై చేసుకుంటే
మంచిదని సూచిస్తున్నారు. అది చర్మాన్ని ఎంతో బాగా పరిరక్షిస్తుందని చెప్తున్నారు. కొత్త ఉత్పత్తులన్నీ లోషన్ ఫార్ములాలతో వస్తూ చర్మంపై రాసుకోవడానికి ఎంతో సులువుగా కూడా ఉంటున్నాయి. ఇవి సాంప్రదాయ ఆయింట్ మెంట్లలాగ ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పైగా గ్రీజీగా ఉండటం లేదు కూడా.


 స్నానం చేసేటప్పుడు అందులోనూ జిమ్స్, కమ్యూనిటీ బాత్రూముల్లో చేసేటప్పుడు తప్పనిసరిగా షవర్ షూస్ వేసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. వీటిని ధరించడం వల్ల పాదాల చర్మం బాక్టీరియా బారిన పడకుండా సురక్షితంగా ఉంటుందంటున్నారు. అందుకే పబ్లిక్ షవర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శరీరంపై రాసుకున్న సబ్బు నురగ నుంచి కూడా చర్మసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరి చర్మంపై ఫంగస్ చేరే అవకాశం ఉంది. అందుకే పబ్లిక్ షవర్ చేసేటప్పుడు, జిమ్స్ లో ఉండేటప్పుడు షవర్ షూస్ వేసుకోవడం అత్యుత్తమం. ఇలా చేయడం వల్ల అవాంఛిత ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా అరికట్టవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News