Friday, September 20, 2024
HomeతెలంగాణVeernapalli: కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టమేనా?

Veernapalli: కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టమేనా?

పార్టీకి సేవచేసిన ఫలితం లేదని, కష్టనష్టాలకోర్చి తెంగించి కొట్లాడినా పార్టీ పట్టించుకోలేదని ఆవేదనతో ఉన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపళ్లి మండలంలో బలమైన ప్రతిపక్షం గా వున్న కాంగ్రెస్ ఒక్కసారిగా సైలెంట్ అవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై మండల ప్రజల్లో సార్వత్రా చర్చ జరుగుతుంది. మండల నాయకుల మధ్య విభేదాల కారణంగా పార్టీ వునికి దెబ్బతింటుంది అనే ఆరోపణ బలంగా వుంది. గత నాలుగు సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర నాయకుల పర్యటన లేని సందర్భంలో వీర్నపల్లి లో కాంగ్రెస్ తన వునికి చాటుకున్నది.స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా వున్న నాయకులు ఒక్కసారిగా ఎడమొఖం పెడముఖంగా వున్నారని అంటున్నారు. మండల శాఖ, యువజన శాఖ అని తేడా లేకుండా యువజన నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మండలంలోని ముఖ్య సమస్యలు అయిన పోడు, రోడ్డు, డబల్ బెడ్రూం, ప్రభుత్వ భవనాలు ఇంకా పలు సమస్యల పై చాలా పోరాటాలు చేశారు. కానీ సెస్ ఎన్నికలు ఈ విభేదాలకు కారణమని కొందరు కార్యకర్తలు అంటున్నారు. సెస్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మండల శాఖ అధ్యకుడి రాజీనామా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడం దీనిపై పార్టీలోని మరో నాయకుడు ఖండించడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై క్రమశిక్షణ చర్యలు కూడా లేవు అని కార్యకర్తలు అందరూ అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యం లో జరిగిన అంశాలు అన్ని విభేదాలకు కారణమని తెలుస్తోంది. తొమ్మిది సంవత్సారాలుగా అధ్యక్ష పదవి మార్పు చేయకపోవడం కూడా ఒకవంతు కారణమని తెలుస్తోంది. మండలంలో కాంగ్రెస్ కి బలమైన నాయకులు కొందరే వున్నా గర్జనపల్లి నుండి వున్న నాయకుడు పార్టీకి రాజీనామా చేసి ఏ కార్యక్రమాలకి హాజరు కాకపోవడంతో కొంతమేర బలం తగ్గొచ్చు అని అనుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష మార్పు తర్వాత కాంగ్రెస్ మండల శాఖలు మారి నూతన ఉత్తేజం వస్తుంది అని ఆశించినా ఫలితం మాత్రం శూన్యం. కొందరు నాయకులు పార్టీకి సేవచేసిన ఫలితం లేదని, కష్టనష్టాలకోర్చి తెంగించి కొట్లాడినా పార్టీ పట్టించుకోలేదని ఆవేదనతో వున్నట్లు తెలుస్తోంది.ఈ విభేదాలను అధికార పార్టీ వినియోగించుకోవటానికి పావులు కదుపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకులు కే కే మహేందర్ రెడ్డి గారు మండలంలో పర్యటిస్తూ నాయకులను కలిసి పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో విశ్వాసాన్ని కూడగట్టి తను ఎమ్మెల్యేగా పోటీ సేసిన ఆ నాటి తనతో కలసి ఉన్న నాయకులు కార్యకర్తలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.అయిన ఇంకొంతమేర పోసగడం లేదు అని అనుకుంటున్నారు.జిల్లా నుంచి మండల స్థాయి వరకు వర్గపోరు నడుస్తుంది అని వినికిడి. బలంగా పోరాటం చేసే నాయకులకే పట్టం కట్టాలని కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మండలం లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే అని అభిప్రాయ పడుతున్నారు.ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా మండలంలో పార్టీని నడిపించే సత్తా వున్న లీడర్ని ఎన్నుకోవడం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విఫలం అవుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందర్లో పార్టీ కేడర్ని పెంచుకుంటే మండలం లో మంచి పరిణామాలు చోటుచేసుకుoటాయి అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News