Saturday, November 23, 2024
HomeతెలంగాణSingareni: ఎన్నికలను అడ్డుకుంటున్న సింగరేణి యాజమాన్యం

Singareni: ఎన్నికలను అడ్డుకుంటున్న సింగరేణి యాజమాన్యం

ఇది విప్లవ ట్రేడ్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు చరిత్ర అని, ఒకరు ఈ చరిత్రను వక్రీకరిస్తే కుదరదు

గోదావరిఖని పట్టణ IFTU కార్యాలయంలో ఐ.ఎఫ్.టి.యు రామగుంగం 1డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ. కృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఒకే పరిశ్రమలో ఒకే యూనియన్ ఉండాలని సింగరేణిలో మొట్టమొదట ప్రచారం నిర్వహించిన ఏకైక సంస్థ విప్లవ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టియు
ఆ తర్వాతనే మిగతా యూనియన్ లు అని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం
ఎన్నికల నిర్వహించాలని చివరికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై మొదటి ధఫా ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేట్లో, రెండవ ధఫా ఎన్నికల్లో రామగుండం ఒకటవ, రెండవ డివిజన్లలో విజయ డంకా మోగించి ప్రాతినిధ్యం వహించిందన్నారు. ఇది విప్లవ ట్రేడ్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు చరిత్ర అని, ఒకరు ఈ చరిత్రను వక్రీకరిస్తే కుదరదన్నారు. ఇవాళ జాతీయ సంఘాలు విప్లవ సంఘాలను రిజిస్టర్డ్ సంఘాలను మేనేజ్మెంట్ తో చర్చించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. విప్లవ సంఘాల యెడల రిజిస్టర్డ్ యూనియన్ల ఎడల వీరికి ఏమీ లేదని యాజమాన్యం మెప్పును పొందుతున్నారని అన్నారు.
సింగరేణి యాజమాన్యం వీరి అడుగులకు మడుగులోత్తుతూ విప్లవ సంఘాలను రిజిస్టర్డ్ సంఘాలను తమ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చలలో పది కార్మిక సంఘాలు ముక్తకంఠంతో రెండు సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేశాయన్నారు. దానికి డిప్యూటీ లేబర్ కమిషనర్ కూడా సుముఖం వ్యక్తం చేశారన్నారు. జాతీయ సంఘాలు సింగరేణి యాజమాన్యం అడ్డుకుందని విమర్శించారు. నాలుగు సంవత్సరాలు ఉండాలని వాదించారన్నారు. చివరికి సింగరేణి యాజమాన్యం విభజించి పాలించే సూత్రాన్ని అమలు చేస్తూ సింగరేణి భవన్ లో తన తొత్తు సంఘాలైన జాతీయ సంఘాలతో సమావేశం నిర్వహించారని, మల్లి జాతీయ కార్మిక సంఘాల తో సింగరేణి యాజమాన్యం సింగరేణి భవన్ లో మల్లి సమావేశం ఏర్పాటు వెనకాల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
జాతీయ సంఘాలకు కూడా గుర్తింపు సంఘం హోదాని ఇచ్చి సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకుండా తమ తొత్తులతో సింగరేణిని నడపాలని భావిస్తుందని సింగరేణి యాజమాన్యం సింగరేణి నీతిమాలిన చర్యలను కార్మికులంతా ఖండించాలని విజ్ఞప్తి చేసారు. విప్లవ సంఘాలపై రిజిస్టర్డ్ సంఘాలపై అవహేళన చేస్తూ మాట్లాడుతున్న ఈ సంఘాల నాయకులకు గతంలో విప్లవ కార్మిక సంఘాల జోలికి వస్తే ఏమవుతుందో గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో రెండు సంవత్సరాల ఎన్నికల కాలపరిమితి ఉండాలని ప్రతి ఒక్క కార్మికుడు డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో ఈ. నరేష్, కొమరయ్య, ఎండి యూసుఫ్, ఎన్ సి బాబు, ఐ సాంబయ్య. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News