Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభRaviteja : వాల్తేరు వీర‌య్యలో ర‌వితేజ లుక్‌పై అదిరిపోయే అప్‌డేట్

Raviteja : వాల్తేరు వీర‌య్యలో ర‌వితేజ లుక్‌పై అదిరిపోయే అప్‌డేట్

Raviteja : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీర‌య్య‌’. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. మైత్రీమూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

- Advertisement -

ఇప్ప‌టికే చిరంజీవి లుక్, రోల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి సినిమాపై అంచ‌నాల‌పై భారీగా పెంచింది. అయితే.. ర‌వితేజ రోల్ సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. దీంతో మాస్ మ‌హ‌రాజా ప్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇక వీరిలో కూడా జోష్ నింపేందుకు చిత్ర బృందం సిద్ధ‌మైంది. ర‌వితేజ లుక్‌కు సంబంధించిన అదిపోయే అప్‌డేట్‌ను అందించింది.

“మీరు అంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నార‌ని నాకు తెలుసు. నాలో ఉన్న కొత్త వ్య‌క్తిని డిసెంబ‌ర్ 12న ఉద‌యం 11గంట‌ల 7 నిమిషాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నా” అని ర‌వితేజ ట్వీట్ చేశాడు. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇక ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ గొడ్డ‌లి ప‌ట్టుకుని గ్యాస్ సిలిండ‌ర్‌ని లాక్కొని వెలుతున్నాడు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News