Friday, September 20, 2024
HomeNewsMLA Sridevamma: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

MLA Sridevamma: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో రోగాలకు వర్తించే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం

సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవి ఎమ్మెల్యే స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 17 మంది లబ్ధిదారులకు 24 లక్షల 21 వేల విలువగల చెక్కులను పంపిణీ చేసారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికేర మండలాలలోని మొత్తం 17 మంది బాధితులకు చెక్కలు పంపిణీ చేసి ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో రోగాలకు వర్తించే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం చాలా సంతోషకరమని అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించడం పేదవారికి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన విదంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసాన్ని కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 2400 కి పైగా రోగాలను చేర్చడం చేర్చీ మిగతా రోగాలకు సీఎం ఆర్ఎఫ్ నుండి సహాయమందించామన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ సహాయం చేసిన ముఖ్యమంత్రికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News