కరీంనగర్ పట్టణ సుందరీకరణలో భాగంగా తొలి తెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న విగ్రహాన్ని మనేరు రివర్ఫంట్ బ్రిడ్జి పైన నెలకొల్పాలని కోరుతూ రాష్ట్ర పౌర సరఫరా, బిసి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ ను గౌడ సంఘ ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి మనేరు రివర్ ఫ్రంట్ మనేర్ బ్రిడ్జిపైన గొలు కొండకోటతో కూడిన సర్వాయి పాపన్న వీర విగ్రహంతో కూడిన ఐలాండ్ ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే మంత్రి గంగుల కమలాకర్ ఆర్కిటెక్ట్ తో మాట్లాడి విగ్రహం ప్రతిష్టకు అవసరమైన అంచనా వ్యయం సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కు గౌడ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయ కులు వీరాగొని పెంటయ్య, కలర్ శత్తెన్న గౌడ్, కోటగిరి భూమా గౌడ్, కట్ట సత్తయ్య గౌడ్, గొడిషేల రమేష్ గౌడ్ , అమరగాని నర్సయ్య గౌడ్, జక్కుల మల్లేశం గౌడ్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, మల్లేశం గౌడ్, పరకాల మురళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Gangula: సర్వాయి పాపన్న వీర విగ్రహం ఏర్పాటుకు మంత్రి హామీ
మనేరు రివర్ ఫ్రంట్ మనేర్ బ్రిడ్జిపైన గొలు కొండకోటతో కూడిన సర్వాయి పాపన్న వీర విగ్రహం