Tuesday, April 15, 2025
HomeతెలంగాణMahabubnagar: పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయి

Mahabubnagar: పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయి

పల్లెలు పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధుల బారిన పడేవారి శాతం తగ్గింది

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, బూత్ పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను పారిశుధ్య పనివారు బాగా చేస్తున్నారని, పచ్చదనం,పరిశుభ్రత విషయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వం గ్రామాలలో అన్ని మౌలిక వసతులు కల్పించిందని, గతంతో పోలిస్తే పల్లెలు పరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాధుల బారిన పడేవారి శాతం తగ్గిందన్నారు. శంకుస్థాపన చేసిన 3 నెలల్లో గ్రామ పంచాయతి భవనాన్ని కట్టిన సర్పంచ్ బోలశేఖర్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు. జిల్లాలో చేపట్టిన అన్ని గ్రామ పంచాయతీ భవనాలను త్వరలోనే పూర్తి చెయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.3 నెలల్లో జి పి భవనాన్ని కట్టిన సర్పంచ్ బోల శేఖర్ ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన జి పి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం లో జరగని అభివృద్ధి తెలంగాణ లో జరిగిందని, అభివృద్ధి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువిడవకుండా శ్రమిస్తున్నారని అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో నూతనంగా 50 గ్రామ పంచాయతీ భవనాలను ఏర్పాటు చేయడానికి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి కదిరె శేఖర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, సర్పంచ్ బోల శేఖర్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్ గౌడ్ ,సాయిలు, మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహశీల్దార్ చెన్నకిష్టన్న, ఎం పి డి ఓ మున్నీ,వివిద గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News