Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: యువత స్వయం ఉపాధితో ఎదగాలి

Gangula: యువత స్వయం ఉపాధితో ఎదగాలి

నిరుద్యోగులు కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ఎదగాలి

నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఎదగాలని మాజీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కోరారు. చాగలమర్రిలో వైఎస్సార్సీపీ నాయకులు గేట్ల మహబూబ్ సబ్ గారి మనవడు బసమ్మ గారి మహబూబ్ బాషా మల్లెవేముల బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మహబూబ్ ఐరన్ మార్ట్ దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులు కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ఎదగాలని ఆయన కోరారు. ఇలాంటి వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్. మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ,ఉప సర్పంచ్ సోహైల్, ఎంపీటీసీలు వార్డు సభ్యులు గేట్ల మాబు సబ్, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News